/rtv/media/media_files/2025/08/07/india-russia-2025-08-07-22-30-07.jpg)
Vladmir Putin, Ajith Dhoval
రష్యా, ఉక్రెయిన్ వార్...గత మూడేళ్ళుగా కొనసాగుతోంది. తాను అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లో యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీరాలు పలికారు. అయితే అది సాధ్యపడలేదు. ఏం చేసినా మాట వినేదే లేదు అని మొండిపట్టుదల పట్టుకుని కూర్చొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇది ట్రంప్ కు పెద్ద సవాల్ గా మారింది. రష్యా మీద టారీఫ్ లతో దండెత్తారు. రకరకాలుగా బెదిరించి చూశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాల పడ్డారు ట్రంప్. ఆ దేశాల మీద సుంకాల వత్తిడి తీసుకువచ్చి రష్యాను అదుపు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ మీద కూడా అధిక సుంకాలను అమలు చేశారు. ఏకంగా 50 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్ కు రష్యా మద్దుతుగా నిలిచింది. ట్రంప్ నిర్ణయాలు అసమంజసంగా ఉన్నాయంటూ ఆ దేశం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇలా అన్ని దేశాల మీద అధికారాన్ని చెలాయించాలని అనుకోవడం మంచి విషయం కాదని చెప్పింది.
పుతిన్ తో అజిత్ ధోవల్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
ఈ నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలో ఆ దేశాధ్యుక్షుడు పుతిన్ ను కలిశారు. వీరిద్దరి మధ్యా రెండు దేశాల వ్యాహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం లాంటి విషయలపైచర్చ జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడది చివర్లో పుతిన్ భారత పర్యటన గురించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటనలో తెలిపారు. దీనిపట్ల భారత ఎంతో ఉత్సాహంగా ఉందని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాలు, వాణిజ్య అనిశ్చితుల మధ్య పుతిన్ పర్యటన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోనుందని అజిత్ ధోవల్ చెప్పారు. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా సాగుతున్నామని సూచించారు. ట్రంప్ టారీఫ్ ల నిర్ణయాల నేపథ్యంలో అజిత్ ధోవల్ రష్యా పర్యటన ప్రధాని మోదీ కొత్త వ్యూహం అని చెబుతున్నారు. అలాగే పుతిన్ భారతదేశ పర్యటన కూడా అందులోని భాగమే అంటున్నారు. రెండు దేశాలు కలిసి అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యం ముందు సాగనున్నాయని సమాచారం. దీనికి తోడు అమెరికాకు మరో వ్యతిరేక దేశమైన చైనా కూడా భారత్ కు మద్దతు పలుకుతోంది. ట్రంప్ టారీఫ్ ల మీద ఆ దేశం కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు రష్యా, భారత్ లతో పాటూ చైనా కూడా కలిస్తే అది అమెరికాకు మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: Gold Rates: ట్రాంప్ టారీఫ్ ల ఎఫెక్ట్...రికార్డు స్థాయిలో బంగారం ధరలు