Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. బిగ్‌ షాక్‌లో బంగ్లాదేశ్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా నుంచి సాయం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Trump and Yunas

Trump and Yunas

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి ఆయన షాకిచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా నుంచి సాయం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్‌లో ఆహార భద్రత, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోతాయి. 

Also Read: తేనెకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు చూశారా ? వీడియో వైరల్

మొత్తం 90 రోజుల పాటు వివిధ దేశాలకు అమెరికా సాయాన్ని ఆపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌కు కూడా ఈ సాయం నిలిపివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్, ఈజిప్ట్‌ దేశాలకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజుల పాటు అమెరికా నుంచి అందే సాయాన్ని నిలిపివేశారు. ఇదిలాఉండగా.. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read: జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు!

జన్మతః పౌరసత్వ హక్కు రద్దు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వెళ్లిపోవడం, ఫెడరల్ వర్కర్లు ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు ట్యాక్స్ వసూళ్లు చేసే 'ఇంటర్నెల్ రెవెన్యూ సర్వీస్‌'లో కొత్తగా చేరిన 90 వేల మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. లేదా తొలగిస్తామన్నారు. వాళ్లకు తుపాకులు ఇచ్చి సరిహద్దుకు పంపిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోని వివిధ దేశాలకు 90 రోజుల పాటు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. 

Also Read: స్టార్‌లింక్‌ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్‌ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్‌

Also Read: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష.. రేవంత్ ఫైర్

Advertisment
Advertisment
తాజా కథనాలు