Starlink: స్టార్‌లింక్‌ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్‌ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్‌

ప్రపంచంలో ఏ మూలనా, ఎక్కడున్నా సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్‌ అందించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ జనవరి 27న ప్రారంభం కానుంది. ఇది సక్సెస్‌ అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా సిగ్నల్స్‌ సమస్య ఉండదు.

New Update
Starlink Satellite and Elon Musk

Starlink Satellite and Elon Musk

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మారుమూల ప్రాంతాల్లో, అడవుల్లో ఇంటర్నెట్ సేవలు ఉండవు. అంతేకాదు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కూడా సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ రావు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యలకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ చెక్ పెట్టనుంది. ప్రపంచంలో ఏ మూలనా, ఎక్కడున్నా సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్‌ అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ జనవరి 27న ప్రారంభం కానుంది.    

Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్‌

 శాటిలైట్‌ నుంచి నేరుగా సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందేలా.. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ బీటా టెస్టును ప్రారంభించనుంది. ఈ మేరకు స్టార్‌లింక్ సీఈవో ఎలాన్ మస్క్‌ ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా అసలు నెట్‌వర్క్‌ సమస్యే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి సెల్‌ఫోన్ టవర్ల పనిలేకుండానే శాటిలైట్స్‌ నుంచి ఫోన్లలకు నేరుగా సిగ్నల్స్ వస్తాయి. 

Also Read: 150 కేజీల పువ్వు.. దీని దుర్వాసన అస్సలు భరించలేం: వీడియోలు చూశారా!

కమ్యూనికేషన్స్‌ రంగంలో స్టార్‌లింక్‌ కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుంది. సెల్‌టవర్ల వల్ల కొంత పరిధి మేరకే సెల్‌ఫోన్లకు సిగ్నల్స్‌ వస్తాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, అడవుల్లో సిగ్నల్స్ ఉండవు. స్టార్‌లింక్‌కు చెందిన శాటిలైట్‌ సర్వీస్‌ ద్వారా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా సిగ్నల్స్‌ వస్తాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే ఈ బీటా పరీక్షలు విజయవంతమైతే త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.  

Also Read: ఆ 90 వేల మంది ఉద్యోగుల్ని సరిహద్దుకు పంపిస్తా.. ట్రంప్ మరో బాంబ్

Advertisment
Advertisment