Crime: జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు!

మహారాష్ట్రలో షాకింగ్​ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆమె భర్త సోదరుడు, ఇతరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 31 గంటల పాటు ఆమె నరకం చూపించారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. అయితే ఆమె భర్త జైలులో ఉండగా బెయిల్ కోసం తిరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

New Update
Woman Gang Raped By Brother-In-Law

Woman Gang Raped By Brother-In-Law

ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. సొంత వాల్లే శత్రువుల్లా మారుతున్నారు. మంచి వాళ్లుగా నటించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. తమ్ముడు భార్యపై అన్న తన ఫ్రెండ్స్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు 31 గంటల పాటు ఆమె నరకం చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

బెయిల్ కోసం తిరుగుతూ

18 ఏళ్ల వయసు కంటే చిన్నగా (మైనర్‌గా) ఉన్నపుడు ఆ యువతికి పెళ్లి అయింది. కానీ ఆ యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో.. తమ కూతురి భర్తపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి ముంబై జైల్లో ఉంచారు. ఇక అప్పటి నుంచి ఆ యువతి తన భర్త బెయిల్ కోసం తెలిసినవారందరినీ సంప్రదిస్తూ వస్తోంది. 

Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?

బెయిల్ ఇప్పిస్తా

ఈ క్రమంలోనే తన భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి ఆ యువతిని కలిసాడు. తమ్ముడికి బెయిల్‌ ఇప్పిస్తానని.. ఒకసారి తనను కలవమని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే.. ఆ యువతి బుధవారం నాసిక్‌ వెళ్లి కలిసింది. 

చెట్టుకు కట్టేసి

బెయిల్ కోసం గ్యాంటర్‌ని కలవాలని చెప్పి ఆ యువతిని తీసుకుని అతడు పంచవటి ప్రాంతానికి వెళ్లాడు. మార్గ మధ్యలో అతడితో మరికొందరు కలిసారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతిపై దాడి చేశారు. ఆమెను ఒక చెట్టుకు కట్టేసి చాలా సేపు కొట్టారు. అంతేకాకుండా ఆ యువతపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. 

Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

31 గంటల పాటు నరకం

ఇలా దాదాపు 31 గంటల పాటు ఆమెకు నరకం చూపించారు. స్పృహ కోల్పోయినా.. లేపి మరీ కొట్టారు. గురువారం సాయంత్రం వరకు ఇలానే కృరంగా ప్రవర్తించారు. ఇక టాయిలెట్‌కి వెళ్లాలని చెప్పి ఆ యువతి అక్కడ నుంచి పరారైంది. చివరికి నాసిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు అయిన విజయ్ దామ్లే, గోపాల్ రాజేంద్ర నాగోల్కర్‌ను అరెస్టు చేశారు. కానీ ప్రధాన నిందితుడిని ఇంకా పట్టుకోలేదు. 

Advertisment
తాజా కథనాలు