/rtv/media/media_files/2025/08/12/donald-trump-extends-china-tariff-deadline-by-90-days-2025-08-12-10-28-02.jpg)
Donald Trump extends China tariff deadline by 90 days
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుందనే కారణంతో ఇటీవల 25 శాతం అదనంగా టారిఫ్ విధించారు. భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. చైనా విషయంలో మాత్రం భిన్న వైఖరిని అనుసరిస్తున్నారు. గతంలో ఆయన చైనాపై చేసిన టారిఫ్ వార్ సంచలనం రేపింది. అమెరికా, చైనా ఒకదానికికొకటి టారిఫ్‌లు పెంచుకుంటూనే పోయాయి. ఈ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికా దిగుమతులపై సుంకాలను చైనా 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే చైనా దిగుమతులపై సుంకాలను అమెరికా 145 నుంచి 30 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు 90 రోజుల పాటు అమల్లో ఉండేలా ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందం మంగళవారం అర్ధరాత్రి నాటికి ముగియనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడగించారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల గడువును పొడిగించినట్లు చైనా మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం మరో 90 రోజుల పాటు పొడిగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
ఇక భారత్‌పై అమెరికా 25 శాతం అదనంగా టారిఫ్ విధించడంతో ఇది ఆగస్టు 27 నుంచి అమలు కానుంది. భారత్, చైనాతో పాటు అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. కానీ చైనాతో మాత్రం ఈ ట్రేడ్ డీల్ పూర్తి కావడం లేదు. దీనిపై ఇరుదేశాలు చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పలు అంశాల్లో ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది చివర్లో అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య భేటీ జరగనుంది.ఆ సమావేశంలో ట్రేడ్ డీల్ పూర్తిచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: భారత్‌ను కవ్విస్తున్న చైనా..సరిహద్దుల వెంట కీలక ప్రాజెక్టుల నిర్మాణం
మరోవైపు ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడారు. అయితే సుంకాల విషయంలో చైనా కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రష్యా నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. భారత్ పాటు చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురును ఎగుమతి చేసుకుంటోంది. మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. ఇంతకుముందే 25 శాతం టారిఫ్ విధించగా.. దాన్ని 50 శాతానికి పెంచారు.
Also Read: జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్.. యుద్ధంపై కీలక అంశాలు చర్చ