Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన  మంత్రి లోకేష్

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీల్లో సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు.

New Update
Nara Lokesh

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక సూచనలు చేశారు. మంత్రి ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై సమీక్షించారు. 'ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించి... జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. త్వరలో చేపట్టనున్న డీఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా సమావేశంలో కూలంకుషంగా చర్చించామని పేర్కొన్నారు.

Also Read: Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!

అధ్యాపకుల సమస్యలను...

'జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై సమావేశంలో చర్చించాం. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం.  విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని, అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించాను. 

Also Read:  Hyderabad Crime: యూ బెగ్గర్‌ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!

నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని కోరాను. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు'అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. విద్యాహక్కు చట్టంలోని నిబంధనల మేరకు విద్యార్థుల్లో అభ్యసన ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయుల జవాబుదారీతనం, పనితీరు మదింపునకు సూచికలు రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. 

'విద్యాహక్కు చట్ట నిబంధన 25(2)(డి) ప్రకారం జవాబుదారీతనం, పనితీరు సూచికలు తయారు చేయాలని, 25(2)(ఈ) మేరకు ఉపాధ్యాయులు, అధికారులు, వ్యవస్థల పనితీరును నిర్దిష్టకాలంలో మదింపు చేయాలని'ఆదేశించింది. గరిష్ఠంగా ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. 2023లో డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు