Dinga Dinga Virus: భయపెడుతున్న ’డింగా డింగా’ వ్యాధి..

ఆఫ్రికాలోని ఉగాండాలో డింగా డింగా అనే వింత వ్యాధి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధికి గురైనవారికి వింత లక్షణాలు రావడం కలకలం రేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Dinga Dinga Virus Victims

Dinga Dinga Virus Victims

ఆఫ్రికాలోని ఉగాండాలో డింగా డింగా అనే వింత వ్యాధి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధికి గురైనవారికి వింత లక్షణాలు రావడం కలకలం రేపుతోంది. డింగా డింగా అంటే స్థానిక భాషలో 'కదులుతూ నృత్యం చేయడమని అర్థం. ఇకవివరాల్లోకి వెళ్తే.. ఉగాండాలోని బుండిబుగ్యో అనే జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ముఖ్యంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది.    

Also Read: పాకిస్తాన్ సైన్యంపై తాలిబన్ల దాడి.. 16 మంది మృతి

ఇప్పటిదాకా 400 మందికి పైగా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ వ్యాధి వల్ల ఇంతవరకు ఎలాంటి మరణాలు జరగలేదు. కానీ ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని అక్కడి స్థానిక ఆరోగ్యశాఖ అధకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డింగా డింగా వ్యాధి సోకినవారికి శరీరంలో అనియంత్రిత వణుకు వస్తుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడతారు.   

Also Read: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన పోలీసులు!

బాధితుల కాళ్లు, చేతులు అలా వణికిపోవడంతో దూరం నుంచి వాళ్లని చూస్తే డ్యాన్స్ చేస్తు్న్నట్లు కనిపిస్తుంది. 2023లో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధి గురించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారటం, శరీర నొప్పులు అనేవి డింగా డింగా వ్యాధి లక్షణాలు .  

Also Read: ఈసీ సమగ్రతను దెబ్బతీస్తున్నారు.. కేంద్రంపై మల్లికార్జున ఖర్గే ఫైర్

ఇదిలాఉండగా.. మరికొంతమంది ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధిని 1518లో ఫ్రాన్స్‌లో వచ్చిన డ్యాన్సింగ్ ప్లేగు వ్యాధితో పోలుస్తున్నారు. ఆ సమయంలో ఫ్రాన్స్‌లో కూడా ఈ వ్యాధి సోకిన బాధితులు అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని చెప్పారు. అప్పట్లో దీనివల్ల మరణాలు కూడా జరిగాయని చెప్పారు .  

Also Read: 'పక్కా ప్లాన్ తో కుట్ర.. అక్బరుద్దీన్ ప్రశ్న.. రేవంత్ ఆన్సర్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్'

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు