EC సమగ్రతను దెబ్బతీస్తున్నారు.. కేంద్రంపై మల్లికార్జున ఖర్గే ఫైర్

పోలింగ్‌ బూత్‌లో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేలా పర్మిషన్ ఇచ్చే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

New Update
Mallikarjun Kharge

Mallikarjun Kharge

పోలింగ్‌ బూత్‌లో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేలా పర్మిషన్ ఇచ్చే నిబంధనల్లో ఎన్నికల సంఘం (EC)మార్పులు చేసింది. ఇకపై పోలింగ్‌కు సంబంధించి వెబ్‌క్యాస్టింగ్ రికార్డులను, సీసీటీవీ ఫుటెజ్‌లను, అలాగే అభ్యర్థులకు సంబంధించి వీడియో రికార్డింగ్‌లు చేయకుండా నిషేధం విధించింది. అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం పన్నిన కుట్రలో ఇదికూడా ఓ భాగమేనని మండిపడ్డారు.  

Also Read: పీఎఫ్ ఫ్రాడ్‌ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ

'' ఎన్నికల కమిషన్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ ఇంతకుముందు ఎన్నికల కమిషనర్లను నియమించే సెలక్షన్ ప్యానెల్ నుంచి భరత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. మళ్లీ ఇప్పుడు వాళ్లు చేసే కుట్రలు బయటకు రాకుండా ఉండేందుకు మార్పులు చేస్తున్నారు. ఓటర్ల పేర్లను తొలగించడం, ఈవీఎంలలో పారదర్శక లేకపోవడం లాంటి అక్రమాల గురించి మేము ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కానీ వాళ్లు స్పందించలేదు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు

 మళ్లీ ఇప్పుడు కేంద్రం చేసే కుట్రలు బయటపడనీయకుండా పోలింగ్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటెజ్‌ను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులు చెక్‌ చేయకుండా బ్యాన్ చేసింది. ఇలాంటివి చూస్తుంటే ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోతుందని స్పష్టమవుతోందని'' ఖర్గే తెలిపారు.        

Also Read: అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన!

ఇదిలాఉండగా.. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ రూల్స్-1961లోని రూల్ 93(2)(ఏ)ను శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరణ చేసింది. పోలింగ్‌ బూత్‌లో సీసీటీవీ కెమెరాల తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని.. అందుకోసమే దీనిపై నిషేధం విధించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఫుటెజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ (AI) ద్వారా ఫేక్ వీడియోలు తయారుచేస్తున్నారని చెప్పాయి . 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు