30 మంది ఉగ్రవాదులు ఒకేసారి విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చంపేశారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 16 మంది సైనికులను మట్టుబెట్టారు. ఆర్మీపోస్ట్ మూడువైపుల నుంచి రెండుగంట పాటూ దాడి చేశారని పాక్ ఇంటలిజెన్స్ అధికారులు చెప్పారు. దాడి తర్వాత చెక్ పాయింట్ వద్ద ఉన్న వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను, ఇతర వస్తువులను తాలిబన్లు తగలబెట్టారు.
ప్రతీకార దాడులు...
ఆఫ్ఘన్ సరిహద్దుకు 40 కి.మీ దూరంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని మాకీన్ ప్రాంతంలో తాలిబన్లు తెగబడ్డారు. దాడి తరువాత.. తమ సీనియర్ కమాండర్ల బలిదాలనుకు ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లోతాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ వీరు పాక్ పైసన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. ఇస్లామాబాద్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం.. తాలిబన్ల దాడులు ఈ ఏడాది మరింత గరిష్టానికి చేరుకున్నాయి. పాక్‌లో 1,500 మందికి పైగా పౌరులు, భద్రతా దళాలు,ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్‌లో జరుగుతున్న దాడులను నిలువరించడంలో ఆఫ్ఘన్ పాలకులు విఫలమయ్యారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
Also Read: MH: మహారాష్ట్రలో మంత్రులకు శాఖ కేటాయింపు..శిండే కు మళ్ళీ నిరాశ