'పక్కా ప్లాన్ తో కుట్ర.. అక్బరుద్దీన్ ప్రశ్న.. రేవంత్ ఆన్సర్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్'

పక్కా ప్లాన్ తోనే అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో రేవంత్ ప్రశ్న అడిగించుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారరన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు.

New Update
Bandi Sanjay Allu Arjun Revanth reddy

Bandi Sanjay, Akbaruddin, Revanth Reddy, Allu Arjun-File Photos

అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని ఫైర్ అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతో పాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు. సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు బండి సంజయ్.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన!

ఎంఐఎం ఓ ఐరన్ లెగ్ పార్టీ..

MIMతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎంఐఎం ఓ ఐరన్ లెగ్ పార్టీ అన్నారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందని ధ్వజమెత్తారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్.
ఇది కూడా చదవండి: ఈ ఒక్క వీడియో చూస్తే .. అల్లు అర్జున్ VS రేవంత్ రెడ్డి తప్పెవరిదో తెలిసిపోతుంది!

హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా? అని నిప్పులు చెప్పారు. మీకో న్యాయం? ఇతరులకు ఒక న్యాయమా? అని ప్రశ్నలు గుప్పించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని హితవు పలికారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు