/rtv/media/media_files/2025/02/11/aKwmxhrOZsEEB6JLPuES.jpg)
Donald Trump
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. ఇప్పటికీ యుద్ధం గురించి అదే మాట చెబుతున్నా..ఉక్రెయిన్ విషయంలో మాత్రం కఠినంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ట్రంప్ మీద విమర్శలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ట్రంప్, పుతిన్ కు ఎక్కువ వెయిట్ ఇవ్వడమే అని అంటున్నారు.
Also Read : ఏఐజీ హాస్పిటల్‌కు KCR
ఇప్పటివరకు అమెరికా...ఉక్రెయిన్ కు అన్ని విధాల సహకరించింది. యుద్దంలో ఆ దేశం వెంటే నిలిచింది. ఆయుధాలను అందించింది. నిధులను సమకూర్చింది. కానీ అదంతా బైడెన్ సర్కారులో. ట్రంప్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ రష్యాకు అనుకూలంగా వారితో ఎక్కువ చర్చలు చేస్తున్నారు. దీని గురించి నిన్నో, మొన్నో జెలెన్ స్కీ కూడా సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు సమాచారం అనే వలయంలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని అన్నారు.
Also Read : ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు!
ఎన్నికలు లేని నియంత..
అయితే దీనింతటికీ కారణం ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని విమర్శించడమే అని తెలుస్తోంది. జెలెన్ స్కీ పదవీ కాలం ముగిసినా ఆయన ఇంకా పదవిలోనే ఉన్నారని...యుద్ధ సమయంలో ఎన్నికలు అవసరం లేనందున ఉండిపోయారని అన్నారు. ఎన్నికలు లేని నియంతగా ప్రవర్తిస్తున్నారని ఘాటూ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా కాస్త భూమి ఇస్తే పోయేదానికి అనసవరంగా యుద్ధం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ తో సహా వేలల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు ట్రంప్. యుద్ధానిక ముందే ఉక్రెయిన్ , రష్యాతో ఒప్పందం చేసుకుంటే మంచిది కదా...జెలెన్ స్కీ ఆ పని ఎందుకు చేయలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ మాస్కోపై ఎప్పటికీ గెలవలేదు. నేను లేకుండా ఆ యుద్ధాన్ని ఎవరు కొలిక్కి తీసుకురాలేరని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read : రైతు, భార్య, కొడుకు ముగ్గురూ మృతి.. నిజామాబాద్‌లో తీవ్ర విషాదం
మరోవైపు శాంతి చర్చల్లో తాము పాల్గొనమని ఉక్రెయిన్ అనడాన్ని అమెరికా అధ్యక్షుడు తప్పుబట్టారు. ఉక్రెయిన్‌ను వారికి ఇప్పించేలా నేను ప్లాన్ చేస్తుంటే.. అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటిని ప్రశ్నించారు. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య బుధ్దిలేని యుద్ధం జరుగుతోందని...దీనిని రష్యా ఆపాలనుకుంటోంది అంటూ ట్రంప్ ఆ దేశానికి మద్దతుగా మాట్లాడారు.
Also Read : రేప్‌లు చేసి బయటకొచ్చి.. మళ్లీ రేప్ చేశాడు... చివరకు కుంభమేళాకు వెళ్తుండగా