Crime: రేప్‌లు చేసి బయటకొచ్చి.. మళ్లీ రేప్ చేశాడు... చివరకు కుంభమేళాకు వెళ్తుండగా

రమేశ్‌ సింగ్‌ ఓ సీరియల్‌ రేపిస్ట్‌..  2003, 2014లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయిన బుద్ది రాలేదు. ఫిబ్రవరి 1వ తేదీన ఓ 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపి కుంభమేళాకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
ramesh singh

రమేశ్‌ సింగ్‌ ఓ సీరియల్‌ రేపిస్ట్‌..  2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో అతడికి  కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది.  శిక్ష అనుభవించి 2014లో బయటకు వచ్చాక  8  ఏళ్ల ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కోర్టు ఈ సారి అతడికి ఉరిశిక్ష విధించింది. అయితే 2019లో టెక్నికల్ ఆధారాలతో  హైకోర్టు అతడికి ఉరిశిక్షను రద్దు చేసింది.  జైలు శిక్ష అనుభవించి మళ్లీ బయటకు వచ్చిన రమేష్ బుద్ది మారలేదు.  మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

Also Read :  ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఫిబ్రవరి 7న  11 ఏళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం చేసి చంపాడు. బాధితురాలు ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి తన ఇంటి నుండి అదృశ్యమైంది. ఇంటి సమీపంలోని ఓ అడవిలో తీవ్రంగా గాయపడి కనిపించింది. వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యలు.. ఆరు రోజుల పాటు చికిత్స పొందిన బాలిక  ఫిబ్రవరి 8న ఆసుపత్రిలో ఆమె మరణించింది. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమె ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు.  

Also Read :  కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

మహాకుంభమేళాకు వెళ్తుండగా

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  తొమ్మిది జిల్లాలు, అనేక రైల్వే స్టేషన్లలో విస్తృతమైన సోదాలు నిర్వహించిన పోలీసులు చివరికి ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో  మహాకుంభమేళాకు వెళ్తుండగా రమేష్ సింగ్‌ ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.   చిన్నారులపై వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న ఈ  మృగాడిని న్యాయస్థానం కఠినంగా శిక్షించకపోవడమే పాపమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Also Read :  నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్.. అన్ని రికార్డుల్లో మనమే టాప్ !

ఈసారి రమేశ్‌ సింగ్‌కు ఉరిశిక్ష పడేలా ప్రతి ఆధారాన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.  ఈ ఘటనపై బాధితురాలి అమ్మమ్మ మాట్లాడుతూ, చిన్నారిపై అత్యాచారం జరిగినప్పుడు ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడ్డామని అన్నారు. తమకు చట్టం గురించి తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సంకోచించామని..  కానీ ఇప్పుడు నిందితుడిని అరెస్టు చేయడం పట్ల మేము సంతోషంగా ఉన్నామని తెలిపారు.  

Also Read :  ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు