/rtv/media/media_files/2025/02/20/lrWO41ta7V8Wv7CPwqmJ.jpg)
KCR 1233 Photograph: (KCR 1233)
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆయన హస్పటల్‌కు వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలల క్రితం కేసీఆర్ తొంటికి గాయమై సర్జరీ అయిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం చురుకుగా ఉంటున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకనేందుకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు గురువారం ఉదయం వెళ్లారు. కాగా ఆరు నెలల తర్వాత ఆయన బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు వచ్చి పార్టీ నాయకులతో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
2023 డిసెంబర్‌లో ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు.