Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన

టిబెట్‌‌ను చైనా ఆక్రమించుకోవడాన్ని బౌద్ధుల గురువు దలైలామా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆరు దశాబ్దాలకు పైగా తన గళం విప్పుతున్నారు. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని, అది చైనా వెలుపలే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

New Update
dalailama

dalailama

బౌద్ధగురువు దలైలామా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా రాసిన ఓ పుస్తకంలో ఆయనకో వారసుడు వస్తాడని.. తన ధర్మాన్ని కాపాడేందుకు ఒకరు వస్తాడని... అది కూడా చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని దలైలామా రాసుకొచ్చారు. తన తర్వాత బౌద్ధ గురువు వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన 'వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌లెస్‌'లో అడిగారు. మంగళవారం విడుదలైన ఈ పుస్తకాన్ని ఓ జాతీయ వార్తా పత్రిక సమీక్షించింది. 

Also Read: Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

దాదాపు ఆరు దశాబ్దాలుగా టిబెట్‌ నియంత్రణ విషయంలో చైనా, దలైలామా మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, గతంలో ఓసారి దలైలామా మాట్లాడుతూ తన తర్వాత ఈ పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ, తాజా పుస్తకంలో మాత్రం చైనా వెలుపలే పుడతారని పేర్కొన్నారు. అంటే.. తానే మళ్లీ పడతానని.. ఆ పునర్జన్మ టిబెట్‌ బయట జరగొచ్చని.. అది భారత్‌లో కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు.

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

‘‘పూర్వీకులు తలపెట్టిన కొన్ని కార్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడు.. తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారు’’ అని రాసుకొచ్చారు. బౌద్ధుల 14వ దలైలామాగా మారిన టెంజియన్‌ గ్యాట్సో.. తన 23వ ఏటే టిబెట్‌ నుంచి భారత్‌కు వలస వచ్చేసిన విషయం తెలిసిందే. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనాకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. టిబెట్‌ వాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా అందుకున్నారు. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని వెల్లడించారు.

దలైలామా ప్రస్తుతం భారత్‌లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు. ఇది గిట్టని చైనా.. ఆయనపై కారాలు మిరియాలు నూరుతోంది. తన గడ్డపైనే వారసుడిని గుర్తించాలని కోరుకుంటోంది. టిబెటన్‌ బౌద్ధుల దృష్టిలో దలైలామా తరవాత రెండో స్థానం పాంచెన్‌ లామాదిగా చెబుతుంటారు. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని కాదని చైనా తనే ఒక బాలుడ్ని ఎంపిక చేసేసింది. అయితే అతను టిబెటన్ల ఆమోదం పొందడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వారసుడి ఎంపికపై మరింత ఆసక్తి నెలకొంది. పైగా ... తాను భారత్ లో పుట్టొచ్చు అని అనడం మరింత చర్చనీయాంశంగా మారింది.

ఇక, తన పుస్తకంలో వారసుడి గురించి దలైలామా చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్ర విమర్శలు చేసింది. టిబెటన్ల ప్రతినిధిగా ఉండేందుకు ఆయన ఎటువంటి అర్హత లేదు.. దలైలామాతో సహా బౌద్ధగురువుల పునర్జన్మలు దేశ నిబంధనలకు లోబడి ఉండాలి... టిబెటన్ బౌద్ధుల్లో పునర్జన్మలు ప్రత్యేక సంప్రదాయం.. జీవించి ఉన్న బౌద్ధ గురువు పేరును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలు చేశారు.

Also Read: Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

Also Read:  PAK: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు