/rtv/media/media_files/2025/07/29/covid-vaccines-saved-more-than-25-lakhs-lives-2025-07-29-16-06-50.jpg)
COVID Vaccines Saved More Than 25 Lakhs Lives
2019 డిసెంబర్‌లో చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. కోట్లాది మంది ప్రజలు దీని బారిన పడ్డారు. లక్షలాది మంది చనిపోయారు. ముఖ్యంగా 2021లో వెలుగుచూసిన సెకండ్ వేవ్‌లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా వైరస్ పూర్తిగా అంతమవ్వలేదు. కానీ దీని ప్రభావం మాత్రం చాలావరకు తగ్గిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్స్ వస్తున్నప్పటికీ వాటి వల్ల అంతగా ప్రమాదమేమి లేదు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సమయంలో కొవిడ్ వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
చాలామంది ఆ వ్యాక్సిన్లు వేసుకున్నారు. కేవలం కొన్ని నెలల సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వివిధ కంపెనీల టీకాలు తీసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చాలామంది రెండు డోసులు తీసుకోగా.. మరికొందరు బూస్టర్ డోస్ కూడా వేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు పెరిగిపోయాయి. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా నడిచింది. ఇప్పటికే దాన్ని ఆరోగ్య నిపుణులు పూర్తిగా ఖండించారు. వాళ్లు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందారని పేర్కొన్నారు.
Also Read: ఆగస్టు 1 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో మార్పులు..!
COVID Vaccines Saved 25 Lakhs Lives
తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటి టైమ్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారో శాస్త్రవేత్తలు వెల్లడించారు. సైన్స్ డైలీ నివేదిక ఈ విషయాలు వివరించింది. 2020 నుంచి 2024 మధ్య దాదాపు 25.33 లక్షల మందిని కరోనా వ్యాక్సిన్ కాపాడింది. ఇటలీలో ఉన్న యూనివర్సిటా కాటోలికా, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై సమగ్ర పరిశోధన చేశారు.
ఈ పరిశోధన ఆధారంగానే ఈ కొత్త నివేదిక సమాచారం ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రతి 5400 వ్యాక్సిన్‌లకు ఒక మరణం కట్టడి చేయబడింది. ఈ సమగ్ర పరిశోధనకు సంబంధించి JAMA హెల్త్ ఫోరం అనే వైద్య పరిశోధన జర్నల్‌లో ముందుగా ప్రచురించారు. మరోవైపు చూసుకుంటే కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కూడా మరణాలు సంభవించిన ఘటనలు చూశాం. అయితే టీకాలు వేసుకోవడం వల్ల దాన్ని ప్రాణ నష్టం తీవ్రత చాలావరకు తగ్గినట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది.
Also Read: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు.. 22 మంది మృతి
ప్రస్తుతం చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ప్రజలందరూ సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు. ఇటీవల పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించింది. అయినప్పటికీ దీని ప్రభావం అంతగా కనిపించలేదు. గతంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి ఏం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అందుకే ఆ తర్వాత చాలామంది వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఇక లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైపోవడం, ఎక్కడి వాళ్లు అక్కడే ఇరుక్కుపోవడంతో చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. కరోనా కేసులు ఇప్పటికీ కూడా ఎక్కడ ఓ చోట వస్తూనే ఉన్నాయి. కానీ వాటి వల్ల అంతగా ప్రభావం ఉండటం లేదు. కేవలం మందుల ద్వారా అది నయమైపోతోంది.
covid-19 | covid-vaccine | rtv-news | latest-telugu-news | telugu-news | international news in telugu