August 2025 New Rule: ఆగస్టు 1 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో మార్పులు..!

ఆగస్టు 1, 2025 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్ పరిమితి, ఆటో-పే లావాదేవీలు, బ్యాలెన్స్ అప్‌డేట్‌లలో కొన్ని ఛేంజెస్ జరిగి ఛాన్స్ ఉంది. కొత్త నెల ప్రారంభంలో అనేక మార్పులు జరగడం కామనే.

New Update
august 1st 2025 new rule changes

august 1st 2025 new rule changes

సాధారణంగా కొత్త నెల ప్రారంభమైనపుడు దేశంలో అనేక మార్పులు జరుగుతాయి. గత నెలలో కూడా యూపీఐ, ఎల్‌పిజీ సిలిండర్ ధరలలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్పుడు జూలై నెల ముగిసే సమయం వచ్చింది. మరో రెండు రోజుల్లో ఈ నెల ముగియనుంది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు జరగనున్నాయి. UPI, క్రెడిట్ కార్డ్, LPG సిలిండర్ ధరలు 1వ తేదీ నుండి మారే అవకావం ఉంది. 

Also Read : ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!

August 2025 New Rule

ఈ మార్పులలో కొన్ని నేరుగా సామాన్యుడి జేబుపై భారం మోపినవి అయితే.. మరికొన్ని ఉపశమనం కలిగించేవిగా ఉండనున్నాయి. వీటిలో ఎల్‌పీజీ ధర నుంచి యూపీఐ చెల్లింపు, క్రెడిట్ కార్డు నియమాలకు మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. 

UPIలో మార్పులు

ఆగస్టు 1వ తేదీ నుంచి మొదటిగా యూపీఐలో మార్పు ఉంటుందని సమాచారం. యూపీఐ వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా ఫోన్లలో ఒకేసారి అనేక యాప్‌లను యూజ్ చేసే వారు.. ఇప్పుడు కేవలం రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. దీని కారణంగా పేమెంట్ యాప్ సేవపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్పు చేశారు.

ఆటో-పే లావాదేవీలలో మార్పులు

చాలామంది యూజర్లు SIP, OTT సబ్‌స్క్రిప్షన్ కోసం ఆటో-డెబిట్ చెల్లింపును సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇందులో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా పీక్ అవర్స్ లేనప్పుడు మాత్రమే దీన్ని ఇప్పుడు రీసెట్ చేసే సదుపాయం కల్పించారు. అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇది ఉంటుంది. దీని తర్వాత పీక్ అవర్స్ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు ఉంటుంది. 

క్రెడిట్ కార్డ్‌లో మార్పులు

ఆగస్టు నుంచి ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎస్బీఐ ఈ ప్రకటన వదిలింది. ఈ మార్పు ఆగస్టు 1వ తేదీ నుంచి కాకుండా ఆగస్టు 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం SBI అనేక బ్యాంకుల కార్డులపై రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు బీమా కవర్ అందిస్తోంది. 

Also Read : మార్కెట్‌లోకి ‘కెప్టెన్ అమెరికా’ స్కూటర్.. ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలివే!

LPG ధరలో మార్పులు

ఈ నెలలో అంటే జూలై నెలలో వాణిజ్య LPG సిలిండర్ ధర దాదాపు రూ.60 తగ్గించారు. అయితే దేశీయ LPG ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీని వల్ల ఇప్పుడు రాబోయే ఆగస్టు 1 నుంచి కూడా LPG, CNG, PNG ధరలలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆగస్టు నెలలో వీటి ధరలు పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలలో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. 

బ్యాలెన్స్ అప్‌డేట్‌లు

ప్రతి ట్రాన్సక్షన్ తర్వాత బ్యాంకులు బ్యాలెన్స్ అప్‌డేట్‌లను మెసేజ్ రూపంలో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు పంపడం తప్పనిసరి అవుతుంది. దీని కారణంగా వినియోగదారులు ప్రతిసారీ మాన్యువల్‌గా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. 

August 1st 2025 | Rule Change | business news telugu | latest-telugu-news | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు