/rtv/media/media_files/2025/08/30/trump-health-2025-08-30-08-24-52.jpg)
Trump Health
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం(Trump Health) పై ఆందోళన వ్యక్తం అవుతోంది. బయటకు ఆయన బాగానే కనిపిస్తున్నా...తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నారని చెబుతున్నారు. దీనికి కారణం ఆయన శరీరంలో కనిపిస్తున్న లక్షణాలే అంటున్నారు. కొంత కాలం నుంచి ట్రంప్ ను గమనిస్తున్నవారు చెబుతున్నదాన్ని బట్టి ఆయన ఆరోగ్యం ఏమీ బాలేదని తెలుస్తోంది. తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని...కానీ దాన్ని ట్రంప్ కానీ, వైట్ హౌస్ కానీ బయటపెట్టడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కాలి చీలమండల వాపు గురించి, చేతి మీద ఉన్న మచ్చ గురించి ఇంతకు ముందే బయటకు వచ్చింది. ఇప్పుడు వాటితో పాటూ ఉబ్బిపోయిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటి లక్షణాలను చూపిస్తున్నారు. ఇవన్నీ తీవ్రమైన గుండెజబ్బు లక్షణాలు(Heart Problem Symptoms), దానికి వాడే మందుల ప్రభావం అని చెబుతున్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ను రెడ్ కార్పెట్ పై ఆహ్వానించే సమయంలో ట్రంప్ తూలుతూ నడిచిన తీరును గుర్తుచేస్తున్నారు.
Also Read : ట్రంప్ కు సూపర్ షాక్..టారిఫ్ లు చట్ట విరుద్ధమన్న కోర్టు
పెద్దదవుతున్న మచ్చ..
మరోవైపు ట్రంప్ చేతి మీద మచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. దాన్ని కప్పి ఉంచేందుకు ఆయన ఫౌండేషన్ తో మేకప్ వేస్తున్నారు. తాజాగా పాపుల్స్ హౌస్ మ్యూజియం సందర్శించినప్పుడు, ఓవల్ ఆఫీస్ లో వరల్డ్ కప్ ఈవెంట్ కు అటెండ్ అయినప్పుడు ట్రంప్ చేతి మీద మచ్చ చాలా పెద్దగా కనిపించింది. దాన్ని ఆయన దాచుకోవాలని చాలానే ప్రయత్నించారు కానీ..లేచి నిలబడినప్పుడు స్పష్టంగా కనిపించింది. పైగా మచ్చ కనించకుండా ఉండడానికి ట్రంప్ దాని మీద ఫౌండేషన్ మేకప్ వేసుకున్నారు. ఇది కూడా ప్రత్యేకంగా అందరికీ కనిపించింది. దీంతో మళ్ళీ అందరూ ట్రంప్ ఆరోగ్యం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆయనకు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లీవిట్ మళ్ళీ అదే వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రజల మనిషని..మిగతా అధ్యక్షుల కంటే ఎక్కువగా అందరితో షేక్ హ్యాండ్ చేస్తారని అందుకే చేతి మచ్చ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. పైగా ట్రంప్ నిబద్ధత దాని ద్వారా తెలుస్తోందంటూ కవర్ చేసుకొచ్చారు. ఈమెతో పాటూ వైట్ హౌస్ డాక్టర్ సియాన్ బార్బరెల్లా కూడా ట్రంప్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. ఆయన రక్తాన్ని పలుచన చేసే ఆస్ప్రిన్ వాడుతున్నారని...అందువల్లనే చేతి మీద మచ్చ ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ వయసు 79 ఏళ్ళు...ఈ వయసులో సిరలు వాచడం, మచ్చలు లాంటివి చాలా సహజమని చెప్పుకొచ్చారు.
జేడీ వాన్స్ వ్యాఖ్యలు..
శంలో ఏదైనా భయంకర విపత్తు వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవిని స్వీకరించడానికి అయినా సిద్ధమని చెప్పారు. ట్రంప్ ఆరోగ్యం మీద ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యూఎస్ టుడే తో మాట్లాడుతూ వాన్స్ ఈ మాటలు మాట్లాడారు. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. భయంకర విషాదాలు తలెత్తుతాయి. వాటన్నింటినీ దాటుకుని ట్రంప్ తన పదవీ కాలాన్ని పూర్తి చేశారని అన్నారు. అధ్యక్షుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ఆయనతో పని చేసే వారందరూ చిన్నవాళ్లేనని...అయితే అందరి కంటే చివర నిద్రపోయేది, ఉదయాన్నే లేచేది మాత్రం అధ్యక్షుడేనని వాన్స్ చెప్పారు. అమెరికన్లకు ఆయన మంచి చేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పుకొచ్చారు. వాన్స్ ఇలా మాట్లాడ్డానికి కారణం ట్రంప్ ఆరోగ్యమేనని అంటున్నారు. ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడుతుండడం వల్ల..ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే ఉద్దేశంతో వాన్స్ అలా మాట్లాడారని విశ్లేషిస్తున్నారు.
Also Read : ప్రధాని మోదీకి జపాన్ అరుదైన కానుక..చంద్రయాన్ 5 తో పాటూ పలు కీలక ఒప్పందాలు