/rtv/media/media_files/2025/08/04/trump-2025-08-04-21-36-24.jpg)
Trump
చాలా ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు. అందులో భారత్ కూడా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉక్రెయిన్ యుద్ధానికి సాయం చేస్తోందంటూ భారత్ పై 50 శాతం అదనపు సుంకాలను అమలు చేశారు. దీనిపై తాజాగా యూఎస్ కోర్టు విచారణ చేసింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఆర్థిక అధికారాలకు మించి టారిఫ్ విధించారని చెప్పారు. భారీగా అమలు చేసిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు కామెంట్ చేసింది. వీటిని అక్టోబర్ మధ్య వరకే అనుమతి ఇస్తున్నామని...ఆ తరువాత వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పింది. అయితే ఈ తీర్పును యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు మాత్రం కోర్టు అనుమతినిచ్చింది.
అమెరికా నాశనం అయిపోతుంది..
ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. కోర్టు పక్షపాతంగా తీర్పు చెప్పిందని విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడతానని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని.. చివరకు అమెరికాను గెలుస్తుందని ట్రంప్ అన్నారు. కోర్టు చెప్పినట్టు సుంకాలను తొలిగిస్తే.. దేశ చరిత్రలోనే అదొక గొప్ప విపత్తు అవుతుందని అన్నారు. అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉందని...సుంకాలను మానేస్తే మరింత పడిపోతుందని అన్నారు. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి సుంకాలు ఒక్కటే మార్గమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా నాశనం కాకుండా ఉండాలంటే సుంకాలను విధించాల్సిందేనని అన్నారు. యూఎస్ కార్మికులను కాపాడాలంటే...ఇక్కడ తయారీదారులను, రైతులను కాపాడాలంటే సుంకాలను విధించాల్సిందేనని చాలా గట్టిగా చెప్పారు. టారిఫ్ లసాయంతో అమెరికాను బలమైన , ధనిక దేశంగా మారుస్తున్నానని ట్రంప్ సమర్ధించుకొచ్చారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక చాలా దేశాలపై టారిఫ్ లను అమలు చేశారు. అంతకు ముందు బేస్ 10 శాతం ఉండగా దాన్ని 25, 35, 50, 100 అంటూ తన ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. కెనడా, మెక్సికో, చైనా లపై అన్నింటికంటే అత్యధికంగా టారీఫ్ లను విధించారు. భారత్ పై మ=కూడా ముందు 25 శాతం సుంకాలను అమలు చేశారు. తరువాత మళ్ళీ రష్యా చమురు సాకు చూపించి మరో 25 శాతం బాదేశారు. దీంతో ప్రస్తుతం అమెరికాతో చాలా దేశాలకు వాణిజ్య యుద్ధం నడుస్తోంది.