/rtv/media/media_files/2026/03/04/cia-working-to-arm-kurdish-forces-to-spark-uprising-in-iran-2026-03-04-11-48-06.jpg)
CIA working to arm Kurdish forces to spark uprising in Iran
పశ్చిమాసియా(west-asia) లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య దాడులు తారా స్థాయికి చేరాయి. ఇటీవల ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో సుప్రీం లీడర్ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా(iran us war), ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుర్దీష్ గ్రూపుల పాత్రపై సంచలన వార్తలు వస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ CIA కుర్దీష్ గ్రూపులతో కలిసి ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యూహాలు పన్నుతున్నట్లు అంతార్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్-అమెరికా చేసిన దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఖమేనీ లేకపోయినా కూడా పోరాటం కొనసాగిస్తోంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ తాము అనుకున్న లక్ష్యాలు ఇంకా చేరుకోలేదని భావిస్తున్నాయి. అందుకే ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టి అక్కడి పాలనను కూల్చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐదు ప్రధాన కుర్దిష్ పార్టీలు కలిసి "కోయలిషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్తాన్" అనే కూటమిని ఏర్పాటు చేశాయి. ఇరాన్ పాలనను అంతం చేసి.. కుర్దిష్ ప్రావిన్స్‌లలో తమ సొంత పాలనను ఏర్పాటు చేయడమే ఈ కూటమి టార్గెట్.
Also read: అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ .. అట్రిషన్ యుద్ధంలోకి ఇరాన్
CIA Working To Arm Kurdish
అందుకే ఇరాన్‌లో కుర్దిష్ దళాలలకు ఆయుధాలు సమకూర్చే ప్లాన్‌పై CIA పనిచేస్తోంది. ఇరాన్‌లో ప్రజల తిరుగుబాటుకు ఆజ్యం పోయడమే వీళ్ల లక్ష్యం. అంతేకాదు ఇరాన్ విపక్ష గ్రూపులు, కుర్దీష్ నేతలతో కలిసిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ దళాలకు CIA అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ సైన్యాన్ని (IRGC) సరిహద్దు ప్రాంతాల్లోనే నిలువరించి, లోపల ఉన్న సామన్య ప్రజలు నిరసనలో స్వేచ్ఛగా పాల్గొనేలా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్-ఇరాక్ సరిహద్దులోని రహస్య ప్రాంతాల్లో కుర్దిష్ ఫైటర్లకు అమెరికా సైనిక సలహాదారులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తరచుగా కుర్దిష్ స్థానాలపై దాడులు చేస్తోంది. సరిహద్దు వెంట ఉన్న కుర్దిష్ సమూహాలను టార్గెట్ చేసింది. ఈ దాడులే ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను పెంచాయి. అంతేకాదు మంగళవారం ట్రంప్.. ఇరానియన్ కుర్తిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ (KDP) ఛైర్మన్ ముస్తఫా హిజ్రీతో మాట్లాడారు. IRGCని టార్గెట్ చేసుకున్న సంస్థల్లో కేడీపీ కూడా ఒకటి. అయితే పశ్చిమ ఇరాన్‌లో త్వరలోనే భూ ఆపరేషన్ ప్రారంభం కానుందని ఓ సీనియర్ కుర్దిష్ అధికారి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ కోసం తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
వాస్తవానికి కుర్దిష్ ప్రజలు నివసించే ప్రాంతాన్ని స్థానికంగా "కుర్దిస్తాన్" అని పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేక దేశం కానప్పటికీ, మిడిల్‌ఈస్ట్‌లో నాలుగు ప్రధాన దేశాలలో వీళ్ల సమూహం ఉంది. ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియాలోని పలు ప్రాంతాల్లో వీళ్లు నివసిస్తున్నారు. కుర్దీష్ దళాలతో అమెరికాకు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి.
Also read: ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు.. మెడపై ఎర్రటి మచ్చలు
ఇదిలాఉండగా ఇటీవల ఇరాన్ లోపల ఉన్న వందలాది మంది కుర్దిష్ కార్యకర్తలను విదేశీ శక్తులతో లింక్స్ ఉన్నాయని కారణంతో అరెస్టు చేశారు. ఇరాక్ సరిహద్దు కూడా కుర్దిష్ నేతల స్థావరాలపై IRGC తరచుగా దాడులు చేస్తోంది. అయితే ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ సాయుధ దళాలు రహస్యంగా ఇరాన్ లోపలికి వెళ్లి.. స్థానిక నిరసనకారులకు సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లకు సీఐఏ కూడా మద్దతిస్తోంది. మొత్తంగా ఇరాన్‌లో అంతర్యుద్ధం జరిగేలా చేసి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
Follow Us