Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ .. అట్రిషన్ యుద్ధంలోకి ఇరాన్

యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్‌ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు.

New Update
US and Iran in a War of Attrition

US and Iran in a War of Attrition

మిడిల్ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా మరోవైపు ఇరాన్(iran us war).. డ్రోన్(drones), మిసైల్స్‌ దాడులతో విరుచుకుపడుతన్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్‌ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు. ఈ యుద్ధంలో ఇరాన్ చౌక డ్రోన్లతో దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఖరీదైన, అడ్వాన్స్‌డ్ ఆయుధాలతో వాటిని అడ్డుకుంటున్నాయి. 

ఇరాన్.. 'షాహెద్‌ 136 వన్‌వే' అటాక్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. చిన్న క్రూయిజ్‌ మిసైళ్లలా ఇవి పనిచేస్తాయి. టార్గెట్‌ను చేరుకున్న వెంటనే ఇవి బ్లాస్ట్ అవుతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. ఒక్కో డ్రోన్ తయారుచేసేందుకు కేవలం 20 వేల డాలర్లు (రూ.16 లక్షలు) మాత్రమే ఖర్చవుతుంది. వీటిని అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ వాడుతున్న డిఫెన్స్‌ మిసైల్స్‌ ఖర్చు మాత్రం రూ.కోట్లు దాటుతోంది.   

Also Read: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కొడుకు

US And Iran In A War Of Attrition

ప్రస్తుతం ఇజ్రాయెల్ వాడుతున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క మిస్సైల్ ధర రూ.35-45 లక్షల దాకా ఉంటుంది. ఇక విమానాల నుంచి ప్రయోగించే సైడ్‌వైండర్‌ క్షిపణుల ధర మరీ ఎక్కువగా ఉంటుంది. అమెరికా వినియోగిస్తున్న పేట్రియాట్ మిస్సైల్ సిస్టమ్‌లో ఒక్కో ఇంటర్‌సెప్టర్‌ మిస్సైల్ ఏకంగా రూ.30 కోట్లకు పైగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే ఇరాన్‌ ప్రయోగించే రూ.16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు అమెరికా రూ.30 కోట్ల మిస్సైల్‌ను వాడాల్సిన పరిస్థితి ఉంది. 

Also Read: దుబాయ్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అమెరికా కాన్సులేట్‌ వద్ద డ్రోన్ దాడి

ఈ యుద్ధం ఇలానే కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్‌ వద్ద ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. గల్ఫ్‌లోని పలు దేశాల్లో ఇప్పటికే నిల్వలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. చివరికి ఆయుధాల కొరత ఏర్పడి, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కూడా ఈ యుద్ధాన్ని ఆపేయాల్సిన పరిస్థితులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు