Donald Trump: ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు.. మెడపై ఎర్రటి మచ్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

New Update
Trump Appears With Red Rash On Neck, Officials Say Caused By Skin Cream

Trump Appears With Red Rash On Neck, Officials Say Caused By Skin Cream

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తన మెడపై ఎర్రటి మచ్చలు(skin-rashes) ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్‌ ఏమైంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ దీనిపై వైట్‌హౌస్ అధికారికంగా ఇంతవరకు స్పందించలేదు. కానీ ట్రంప్ వాడుతున్న స్కిన్ క్రీముల వల్లే ఈ ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని తెలిపింది.  

అయితే ట్రంప్ ఎలాంటి చర్మ సమస్యతో బాధపడుతున్నారనే విషయాన్ని వైట్‌హౌస్‌ చెప్పలేదు. ఫిబ్రవరి 19న శ్వేతసౌధంలోని ఈస్ట్‌ రూమ్‌లో మెడల్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు కనిపించాయి. దీన్ని పలువురు ఫొటోలు తీశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళనలు మొదలయ్యాయి. 

Also Read: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కొడుకు

Trump Appears With Red Rash On Neck

మరోవైపు ట్రంప్‌ వైద్యుడు సీన్ బార్బబెల్లా దీని గురించి మాట్లాడారు. ట్రంప్ తన మెడకు ఓ సాధారణ "ప్రివెంటివ్ స్కిన్ క్రీమ్" వాడుతున్నారని తెలిపారు. ఈ క్రీమ్ వల్లే చర్మం ఎర్రగా మారినట్లు చెప్పారు. ఈ ఎరుగు రంగు తగ్గేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని తెలిపారు. ఇదిలాఉండగా ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 ఏళ్లు. ఆయన ఆరోగ్యంపై ఎప్పుడూ నిఘా ఉంటుంది. 

గతంలో ఆయన చేతులపై కూడా ఎర్రటి మచ్చలు కనిపించాయి. దీనిపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. తాను రక్తాన్ని పల్చగా ఉంచే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వేసుకుంటున్నానని తెలిపారు. అందుకే ఎవరికైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు చర్మం త్వరగా కమిలిపోతుందని తెలిపారు. మరోవైపు గతేడాది ఆయనకు 'క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ' (కాళ్లలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వాపు) సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

Also Read: ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా

Advertisment
తాజా కథనాలు