China New Visa: అమెరికా హెచ్ 1బీ వీసాకు పోటీగా చైనా కె వీసా.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

అమెరికా హెచ్ 1 బీ వీసాకు పోటీగా చైనా ప్రభుత్వం కొత్త కె వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా ముఖ్యంగా రిలీజ్ చేయడానికి కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులను ఆకర్షించడమే. మరి ఈ కె వీసా ప్రత్యేకతలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
China k visa

China k visa

అమెరికా(america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్ 1 బీ వీసా(H1B Visa Rules) పై రూల్స్ మార్చిన విషయం తెలిసిందే. వీసా పొందాలంటే తప్పకుండా లక్ష డాలర్లు కట్టాల్సిందే. అయితే అమెరికా హెచ్ 1 బీ వీసాకు పోటీగా చైనా ప్రభుత్వం కొత్త కె వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా ముఖ్యంగా రిలీజ్ చేయడానికి కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులను ఆకర్షించడమే. అయితే చైనా ప్రవేశ పెట్టిన కె వీసా అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

ఇది కూడా చూడండి: BREAKING: పాలస్తీనాను దేశంగా గుర్తించిన బ్రిటన్‌..

కె-వీసా పొందడానికి అర్హతలు

ఈ కె వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఈ వీసా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) వంటి రంగాలలో నైపుణ్యం ఉన్న యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులకు మాత్రమే ఇస్తారు. చైనాలోని లేదా విదేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంస్థలలో బోధనలు, పరిశోధనలలో ఉన్న యువ నిపుణులు కూడా దీనికి అర్హులే. 

వీసా వల్ల ప్రయోజనాల

చైనాలో ప్రస్తుతం ఉన్న 12 సాధారణ వీసా కేటగిరీలతో పోలిస్తే కొత్తగా వచ్చిన ఈ కె వీసా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీసా ఉంటే ఎక్కువ సార్లు చైనాకు వెళ్లి రావచ్చు. అలాగే అధిక వీసా గడువు ఉంటుంది. ఎక్కువ ఏళ్లు అక్కడ జీవించవచ్చు. ఈ వీసా ఉన్నవారు ఉద్యోగ వ్యాపారాలతో పాటు విద్యా సంబంధిత అంశాల్లో కూడా అవకాశాలు చూసుకోవచ్చు. ముందు నుంచి చైనా సంస్థల నుంచి ఎలాంటి ఆఫర్ లేకపోయినా కూడా ఈ వీసాను జారీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ఈజీగా ఉంటుంది. ఈ కె వీసా వల్ల చైనాను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మార్చడానికి దీన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Afghanistan: ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్

Advertisment
తాజా కథనాలు