/rtv/media/media_files/2025/09/21/uk-recognise-palestinian-state-2025-09-21-21-29-00.jpg)
Canada, Australia and UK recognise Palestinian state ahead of UN General Assembly
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటన చేసింది. బ్రిటిష్ ప్రధానమంద్రి కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని అధితారికంగా ప్రకటించారు. పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ పౌరుల్లో శాంతిస్థాపన ఆశలను పునరుద్ధరించేందుకు, ద్విదేశ పరిష్కారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా కెనడా, ఆస్ట్రేలియాలను సైతం పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జులైలోనే కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో కాల్పుల విరమణకు, ఐక్యరాజ్య సమితి సాయం పర్మిషన్‌కు, దీర్ఘకాలిక శాంతికి ఇజ్రాయెల్ అంగీకరించకుంటే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని అన్నారు. అయితే ఇటీవల బ్రిటన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీర్ స్టార్మర్ ప్రభుత్వ ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంలో ప్రధాని స్టార్మర్‌తో విభేదాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటిదాకా పాలస్తీనాను 140కి పైగా దేశాలు గుర్తించాయి. ఇక త్వరలో ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలు కూడా దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్
మరోవైపు పాలస్తీనాను దేశంగా గుర్తించడంలో బ్రిటన్ ఇతర దేశాల ప్లాన్‌లను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఖండించాయి. ఉగ్రవాదంతో పాటు 2023 అక్టోబర్ 7 నాటి దాడుల అంశంలో హమాస్‌కు బ్రిటన్ బహుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ విమర్శలు చేసింది.
Also Read: సడెన్ గా హెచ్ 1-బీ వీసాల ఫీజు పెంపు ఎందుకు? భారత్, చైనాల పై ఒత్తిడి కోసమేనా?