Afghanistan: ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్ అతి పెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ను తిరిగి ఇచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు.  దీనిని తాలిబన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇంచ్ కూడా ఇచ్చేది లేదని చెప్పింది. 

New Update
Afghanistan

ఆఫ్ఘనిస్తాన్ లోని అతి పెద్ద వైమానికి స్థావరం బాగ్రామ్.  రాజధాని కాబూల్ కు ఉత్తరాన ఉంది.  తాలిబాన్ లతో 20 ఏళ్ల యుద్ధంలో అమెరికా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. అఇతే అమెరికా దీనిని వదిలిపెట్టి నాలుగేళ్ళయింది. ఈ ఎయిర్ బేస్ ను అమెరికానే నిర్మించింది.  ఆప్గానిస్తాన్ తో చర్చలు జరుపుతామని...ఎయిర్ బేస్ గురించి మాట్లాడతామని చెప్పారు.  దాన్ని తిరిగి తీసుకుంటామని...వారు అడ్డుకుంటే తాను ఏం చేస్తానో ఎవరో ఊహించలేరని ట్రంప్ హెచ్చరించారు.  అయితే ఎంత తొందరలో చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. అలానే అమెరికా దళాలను ఆప్గానిస్తాన్ కు పంపిస్తారా లేదా అనే దానికి మాత్రం సమాధానం ట్రంప్ చెప్పలేదు. 
చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు.  చైనా నుంచి కేవలం వ్యవధిలోనే ఆఫ్గానిస్తాకు వెళ్ళి రావొచ్చని ట్రంప్ చెప్పారు.  

ఇంచ్ కూడా ఇవ్వము...

ట్రంప్ బెదిరింపులను ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. దీనిపై ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసిహుద్దీన్ ఫిత్రాత్ మాట్లాడుతూ, "కొంతమంది" "రాజకీయ ఒప్పందం" ద్వారా స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు.  కానీ ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆఫ్ఘాన్ నేలలో ఒక్క అంగుళం కూడా ఇవ్వము. ఇలాంటి ఒప్పందాలు సాధ్యం కాదు. మాకు అది అవసరం లేదని అన్నారు. మాకు ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమ్రత అత్యంత ముఖ్యమైనవని ఫసిహుద్దీన్ చెప్పారు. 

2020లో ట్రంప్ మధ్యవర్తిత్వంలో తాలిబాన్ తిరుగుబాటుదారులతో కుదిరిన ఒప్పందంలో భాగంగా, జో బిడెన్ అధ్యక్షతన జూలై 2021లో అమెరికా మరియు నాటో దళాలు బాగ్రామ్ నుండి గందరగోళంగా వైదొలిగాయి. కీలకమైన వైమానిక శక్తిని కోల్పోవడం వల్ల కొన్ని వారాల తర్వాత ఆఫ్ఘన్ సైన్యం కూలిపోయింది మరియు తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు.

Also Read: Priyanka Kumar: బీచ్‌లో నాజుకైన నడుము చూపిస్తూ ప్రియాంక అందాలు.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న కన్నడ బ్యూటీ!

Advertisment
తాజా కథనాలు