High Alert:  అమెరికాలో హై అలర్ట్..యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధానికి మద్ధతుగా నిలవడంతో పాటు ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేస్తోంది. అయితే దీన్ని అమెరికావాసులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా నిరసన కారులు ఆందోళనలకు దిగారు. దీంతో అమెరికాలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

New Update
Hands off Iran Anti war protests

Hands off Iran Anti war protests

 High Alert: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధానికి మద్ధతుగా నిలవడంతో పాటు ఆ దేశంలోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తోంది. అయితే దీన్ని అమెరికా వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్‌పై దాడి చేయడాన్ని విరమించుకోవాలని, ఇజ్రాయెల్‌ కు మద్ధతు ఇవ్వవద్ధని నిరసన కారులు ఆందోళనలకు దిగారు. యూఎస్‌లోని బోస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్ తదితర నగరాల్లో ప్రజలు  స్వచ్ఛందంగా రోడ్లపైకి తరలి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.వారు ప్లకార్డులు చేత పట్టి అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
 
కాగా అమెరికా ఇరాన్‌తో వివదాల్ని వదిలేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో  ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం మానుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లు సూచిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్‌, యూదు దేశానికి ఉన్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా  ప్రదర్శనకారులు బ్యానర్లు పట్టుకుని యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌
 
కాగా ఆదివారం అమెరికా ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు తీవ్ర నష్టం జరగడంతో పాటు ఇరాన్‌ పౌరులు మరణించారు. అయితే దీన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్‌ను వదిలేయాలంటూ అమెరికాకు ఆ దేశ ప్రజలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా బోస్టన్, చికాగోలోని పలు కీలక ప్రదేశాలతోపాటు వాషింగ్టన్ డీసీలోని అధ్యక్ష భవనం వైట్ హౌస్, న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ ఎదుట ప్రజలు ఆందోళనలకు దిగారు. ఇక అమెరికాకు వ్యతిరేకంగా సొంత దేశంలోనే వ్యతిరేకత రావడంతో ఆయా నగరాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. ఆందోళనల నేపథ్యంలో అమెరికాలోని సాంస్కృతిక, మతపరమైన, దౌత్య కార్యాలయల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పలుసార్లు నిరసనలు వ్యక్తం చేశారు అమెరికన్లు.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు