/rtv/media/media_files/2025/08/21/china-double-game-exposed-on-india-and-pakistan-2025-08-21-13-48-32.jpg)
China Double game Exposed on India and Pakistan
2020లో గాల్వన్ లోయలో భారత్-చైనా భద్రతా దళాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా అడగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న వివాదాల గురించి మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనడమే ముఖ్యమని ప్రధాని మోదీ సూచించారు. పరస్పర సహకారంతోనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. అలాగే ఈ నెల చివరిలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరు కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానాన్ని కూడా మోదీ అంగీకరించారు.
Also Read: రష్యా..భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి.. జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్
ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశమ్యయ్యారు. వీళ్లతో కూడా ఆయన సరిహద్దు సమస్యలతో పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడం, శాంతియుత వాతారవణాన్ని నెలకొల్పే అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. అలాగే ఇరుదేశాల మధ్య ఆర్థి, వాణిజ్య సంబంధాలు, సరిహద్దు వ్యాపారం వంటి అంశాల గురించి మాట్లాడుకున్నారు. మొత్తానికి చైనా భారత్‌తో దోస్తీ కట్టేందుకు ముందుకు వచ్చింది. మళ్లీ సంబంధాలు మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
చైనా ద్వంద్వ వైఖరి
కానీ చైన్ ఇక్కడే డబుల్ గేమ్ ఆడుతోంది. ఓవైపు భారత్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే పాకిస్థాన్‌తో కూడా కీలక సంప్రదింపులు జరుపుతోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటన తర్వాత పాకిస్థాన్‌కు కూడా వెళ్లారు. అక్కడి విదేశాంగ మంత్రితో కీలక అంశాలపై చర్చలు జరిపారు. చైనా తమకు పాకిస్థాన్ సహకార భాగస్వామని.. అన్ని వేళల్లా తోడుంటే స్నేహితుడి లాంటిదని కూడా స్వయంగా ప్రకటించుకుంది. ఇప్పటికే చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్(CPEC) లాంటి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇదే ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని సూచిస్తోంది.
Also read: ఎక్కడైనా ఫ్రెండే కానీ ఆంక్షల దగ్గర కాదు..రష్యా విమానాలకు ఇంధనం ఇవ్వని అమెరికా
చైనా ప్రధాన లక్ష్యం తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే. ఇందులో భాగంగానే విభిన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఓవైపు భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు పాకిస్థాన్‌తో కూడా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. చైనా ఈ వ్యూహాత్మక విధానాన్ని అనుసరించడం వెనుక మూడు ప్రధాన వ్యూహాలున్నాయి. ఒకటి భారత్‌ను నిలువరించడం, రెండు ఆర్థిక మరియు వాణిజ్య ప్రయోజనాలు కాపాడుకోవడం, ఇక మూడవది అంతర్జాతీయ వేదికలపై మద్దతు కూడగట్టుకోవడం. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం.
భారత్‌ను నిలువరించడం
ప్రస్తుతం చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్ ఒక శక్తిమంతమైన దేశంగా ఎదుగుతుండడం చైనాకు ఒక సవాలుగా మారింది. భారత్ ఎదుగుదలను నియంత్రించాలంటే ఒకే ఒక్క మార్గం పాకిస్థాన్‌తో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడమే. ఇది భారత్‌పై పశ్చిమ వైపు నుండి నిరంతర ఒత్తిడిని కొనసాగించడానికి వీలు కల్పించేలా చేస్తుంది. అలాగే భారత్ సైనిక శక్తిని దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేయడమే చైనాకు ప్రధాన వ్యూహం.
ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) అనేది చైనా ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) లో ఒక భాగం. CPEC ద్వారా చైనా.. పాక్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ కారిడర్ పాక్‌లోని గ్వాదర్ నౌకాశ్రయంతో అనుసంధానించనున్నారు. దీనివల్ల చైనా మలక్కా జలసంధిపై ఆధారపడటం తగ్గిస్తుంది.
అంతర్జాతీయ వేదికలపై మద్దతు
పాకిస్థాన్, భారత్ మద్దతుతో కూడా.. చైనా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, ఇతర అంతర్జాతీయ వేదికలలో తనకు అనుకూలంగా మద్దతు కూడగట్టుకోగలుగుతుంది. భారత్, చైనా రెండూ బ్రిక్స్ (BRICS) వంటి బహుళ దేశాల కూటములలో సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటములలో పరస్పర సహకారాన్ని కొనసాగించడం ద్వారా అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తగ్గించాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: నువ్వేం పీకలేవు ట్రంప్ అంటున్న రష్యా, భారత్..సుంకాల తర్వాత చమురుపై 5 శాతం డిస్కౌంట్