/rtv/media/media_files/2025/08/21/crude-oil-2025-08-21-07-34-42.jpg)
India-Russia Crude Oil Deal
తాటిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు ఇంకోడు ఉంటాడు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ యుద్ధానికి సహాయం చేస్తోందనే కారణంతో భారత్ పై 50 శాతం అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇదే పనిని చైనా చేస్తున్నా కూడా...ఆ దేశానికి సుంకాలు అమలు చేయలేదు. అదేమని అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారు ట్రంప్ తో పాటూ మిగతా అధికారులు కూడా. పైగా రష్యాపై ఒత్తిడి తేచ్చేందుకే అధిక టారీఫ్ లు అంటూ కవరింగ్ కూడా ఇచ్చారు. అదీకాక పుతిన్ తో జరిగిన సమావేశాన్ని ఉదాహరణగా కూడా చూపెట్టారు.
ఏం చేసుకుంటావో చేసుకో అంటున్న భారత్, రష్యా..
అమెరికా సంగతి ఇలా ఉంటే..భారత్ మాత్రం టారీఫ్ లను చాలా గట్టిగానే ఎదుర్కొంటోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ ఆంక్షలకు తలొగ్గేదే లేదని భారత ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. దేశం, ప్రజల ప్రయోజనాల కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని ముక్కు సూటిగా చెప్పేశారు. మోవైపు రష్యా కూడా భారత్ కు మద్దతుగా నిలిచింది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యూహం ఉందని రష్యా దౌత్యాధికారి రోమన్ బబుష్కిన్ తెలిపారు. అమెరికా చేస్తున్నది అన్యాయమని ఆయన అన్నారు. భారత్‌కు ఎటువంటి ఇబ్బందిలేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కోకు ప్రత్యేక వ్యవస్థ ఉందని బబుష్కిన్ అన్నారు. ఎవరు ఏం చేసిన ాతమ రెండు దేశాల మధ్యా దౌత్య సంబధాలను చెడగొట్టలేరని..క్షణ, సైనిక ఉత్పత్తుల విషయంలో ఇరుదేశాల మధ్య సహకారం ఇప్పుడు మరింత బలోపేతం అయిందని ఆయన చెప్పారు. భారత్ వస్తువులు అమెరికాకు ఎగుమతి చేయలేకపోతే..రష్యా వాటిని కొంటుందని హామీ ఇచ్చారు.
అంతేకాదు ట్రంప్ ఎంత సుంకాలు పెంచినా రష్యా నుంచి భారత్ కు చమురు ఎగుమతి అవుతుందని ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ స్పష్టం చేశారు. దాంతో పాటూ విద్యుదుత్పత్తి, ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గును కూడా రవాణా చేస్తామన్నారు. వాణిజ్య, ఆర్థిక, శాస్త్రసాంకేతికత, సాంస్కృతిక సహకారంపై ఏర్పాటైన భారత్-రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 26వ సదస్సులో డెనిస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎన్.జైశంకర్ కూడా ఇందులో పాల్గొన్నారు.
5 శాతం తగ్గింపు..
ఇదెలా ఉంటే ట్రంప్ సుంకాల విధింపు తర్వాత భారత్ కు రష్యా చమురు మరింత తక్కువ ధరకు విక్రయిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కంటే 5 శాతం తక్కువ ధరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా రాయబారి బబుష్కిన్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. ఇదొక వాణిజ్య రహస్యమని ఆయన చెప్పినట్లుగా సమాచారం. భవిష్యత్తులో కూడా చమురుపై ఫ్లస్, మైనస్ 5శాతం ఉంటుందని రష్యా డిప్యూటీ ట్రేడ్ ప్రతినిధి ఎవ్జెని గ్రివా తెలిపారు.
Also Read: AP: పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఊరుకునేది లేదు..ఎమ్మెల్యే బుడ్డాకు సీఎం చంద్రబాబు వార్నింగ్