Snake Viral Video: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?

ఆస్ట్రేలియాలోని వూరాబిండా ప్రాంతంలో కొందరు చిన్న పిల్లలు పాముతో ఆడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. నల్లటి తల గల కొండచిలువతో వారు స్కిప్పింగ్ ఆడుతూ కనిపించారు. అయితే అది అప్పటికే చనిపోయినట్లు తెలిసింది. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు.

New Update
Children Use Snake As Skipping Rope

Children Use Snake As Skipping Rope

సాధారణంగా పామును చూస్తే పిల్లలతో పాటు పెద్దలు సైతం పరుగులు తీస్తారు. అమ్మో పాము అమ్మో పాము అంటూ కేకలు వేస్తారు. కానీ పాముతో ఎప్పుడైనా స్కిప్పింగ్ ఆడటం చూశారా?.. అదీ పిల్లలే ఆ పని చేయడం మరింత ఆశ్చర్యకరం. అవును మీరు విన్నది నిజమే. అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

కొంత మంది పిల్లలు రాత్రిపూట ఒక పొడవైన పాముతో స్కిప్పింగ్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒకరి తర్వాత మరొకరు పామును పట్టుకుని కిందికి పైకి తిప్పడం చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అందుకు సంబంధించిన వీడియో ఆస్ట్రేలియాలోని వూరాబిండా నుండి వచ్చింది. 

Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

కొండచిలువతో స్కిప్పింగ్

అందులో కొందరు పిల్లలు పామును కింది నుంచి పైకి తిప్పుతుండగా.. మరికొందరు ఆ పాము పైనుంచి నవ్వుతూ దూకుతూ కనిపించారు. దానిని మరొకరు వీడియో తీశారు. అందులో ఏంటి అది నాకు చూపించు అని ఆ వీడియోలో ఓ మహిళ కోరుతుంది. అప్పుడు ఓ పిల్లవాడు.. అది నల్లటి తలగల కొండచిలువ అని చెప్పాడు. అయితే ఆ పిల్లలు పాముతో ఆడుకునే ముందు అది చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ

 ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరేమో ఈ అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నామని.. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తాము అని ఒక నెటిజన్ తెలిపారు. ఇంకొకరేమో.. చనిపోయిన పామును చుట్టూ తిప్పడానికి బదులుగా ఖననం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఆస్ట్రేలియా రూల్స్

కాగా ఆస్ట్రేలియాలో నల్ల తల గల కొండచిలువను చంపడం లేదా గాయపరచడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ట జరిమానా రూ. 6.9 లక్షలు ($7,952) విధిస్తారు. నల్లటి తల గల కొండచిలువలు డౌన్ అండర్ దేశంలోని అతిపెద్ద పాములలో ఒకటి. ఇవి విషం లేని జాతులు. 3.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి, 

Advertisment
తాజా కథనాలు