Israel-Gaza: 15 నెలల తరువాత ప్రశాంతంగా గాజా..!

దాదాపు 15 నెలలపాటు బాంబుల మోతతో హోరెత్తిపోయిన గాజా ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తమ వద్దనున్న 33మంది బందీలను దశలవారీగా విడుదల చేయనున్నారు.

New Update
gaza

gaza

Gaza-Hamas : దాదాపు 15 నెలలపాటు బాంబుల మోతతో హోరెత్తిపోయిన  గాజా ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించింది. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం కారణంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. తమ వద్దనున్న 33మంది బందీలను దశలవారీగా విడుదల చేసేందుకు హమాస్, ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న 737 మంది పాలస్తీనీయులను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ పరస్పర అంగీకారం తెలిపాయి.

Also Read: Ap Govt: ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్‌!

ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో గాజా ప్రశాంతంగా కనిపించింది. నిజానికి నిన్న ఉదయం 8.30 గంటల నుంచే కాల్పుల విరమణ ప్రారంభం కావాలి... కానీ అయితే, తొలి విడతగా ముగ్గురు ఇజ్రాయెలీ యువతుల విడుదలను హమాస్ ఆలస్యంగా 11.15 గంటలకు విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అప్పటి వరకు కాల్పులు కొనసాగించింది. 

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..

ఈ బందీలను గాజాకు చేరుకున్న రెడ్ క్రాస్‌ ప్రతినిధులకు ఆదివారం జనవరి 19, 2025న అప్పగించింది. అనంతరం వారు బందీలను ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు. విడుదలైన వారిలో రోమి గోనెన్‌ (24), ఎమిలీ దమారీ (28), డోరాన్‌ స్టెయిన్‌బ్రేచర్‌ (31)లు ఉన్నారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే, గాజా (Gaza) లో శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చే ప్రక్రియలో మూడు గంటలు ఆలస్యం అయ్యింది. హమాస్‌ నుంచి ఇజ్రాయెలీ బందీల జాబితా విడుదలలో జరిగిన జాప్యం కారణంగా ఒప్పందం అమలు కూడా ఆలస్యంగా జరిగింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ జాబితాను హమాస్ విడుదల చేసింది. ఈ జాబితాను ఇజ్రాయెల్‌ అంగీకరించడంతో, ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. ఒప్పందం అమలైన సందర్భంగా గాజాలో ప్రజలు ర్యాలీలు తీశారు. చాలామంది ప్రజలు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.

ఖాన్‌యూనిస్‌పై జరిగిన ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు. మరోవైపు, ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేయకుంటే గాజాలో యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య 15 నెలలుగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. 

మళ్లీ యుద్ధం ప్రారంభించేందుకు..

‘‘ప్రపంచంలో ఎవరూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినా, ఇజ్రాయెల్‌ సహించదు. ఒకవేళ ఒప్పందం ఎవరైనా ఉల్లంఘిస్తే హమాస్‌ అందుకు బాధ్యత వహించాలి. ఉల్లంఘన జరిగితే మళ్లీ యుద్ధం ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ హక్కు కలిగి ఉంది ’’ అని ఆయన తెలిపారు.

ఇజ్రాయెల్‌ మరియు హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరిన తరువాత, ఈ ఒప్పందం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:30 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి. ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఒప్పందం మూడు దశల్లో అమలవుతుంది.

మొదటి దశలో 42 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఈ దశలో హమాస్‌ 33 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తుంది, అలాగే ప్రతిగా ఇజ్రాయెల్‌ 737 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. 2023 అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడులతో సంబంధం లేని 1,167 మంది గాజా వాసులకు కూడా స్వేచ్ఛ కల్పించడం జరుగుతుంది. 

మొదటి దశలో ఇజ్రాయెల్‌ దళాలు జనావాస ప్రాంతాల నుంచి వైదొలగుతాయి, అలాగే గాజాలోకి మానవతా సాయం రూపంలో ఆహారం, నీరు ఇతర మౌలిక అవసరాలను అందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతిస్తుంది.రెండవ దశలో మిగిలిన బందీలను హమాస్‌ విడుదల చేస్తుంది, కానీ ఇందుకు ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణను శాశ్వత కాల్పుల విరమణగా మార్చేందుకు అంగీకరించాలి. ఇదే ఇజ్రాయెల్‌ అభిప్రాయం, కాగా, హమాస్‌ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుకుంటుంది.

Also Read: Diabetes: బ్లడ్ షుగర్ టెస్టింగ్ కోసం వేలికి గుచ్చుతున్నారా? వైద్యుల షాకింగ్ విషయాలు

Also Read: Neeraj Chopra: సైలెంట్‌ గా పెళ్లి చేసుకున్న ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత నీరజ్‌ చోప్రా...అమ్మాయి ఎవరో తెలుసా!

Advertisment
తాజా కథనాలు