/rtv/media/media_files/2025/05/14/e08y5gT7IreXuqukLt9Q.jpg)
Cannes Film Festival 2025
Cannes Film Festival 2025 : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 78వ కేన్స్ చిత్రోత్సవ వేడుకలు ప్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఈ నెల 24 వరకు సాగనున్నాయి. ఈ సందర్భంగా హాలీవుడ్, బాలీవుడ్ అందాల భామలు సందడి చేశారు. భారతీయ సినీ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా, జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, కరణ్ జోహార్ తదితరులు హాజరై వేడుకలో ప్రత్యేక ఆకర్శణగా నిలచారు.ఈ వేడుకకి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించనున్నారు.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
Cannes Film Festival 2025
కాగా ఈ వేడకల్లో పాల్గొన్న హాలీవుడ్ సెలబ్రిటీల వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. తారలు విభిన్న వస్త్రధారణతో మెరిసిపోయారు. ఈ సందర్బంగా చార్లీచాప్లిన్ గోల్డ్ రష్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం మరో పదిహేను రోజుల్లో వందేళ్లు పూర్తి చేసుకోనుండటం విశేషం. దీనితో పాటు ‘మిషన్ ఇంపాజిబుల్ : ది ఫైనల్ రెకనింగ్’, ‘హయ్యెస్ట్ 2 లోయెస్ట్’ తదితర చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో లెజండరీ యాక్టర్ రాబర్ట్ డి నీరోకు గౌరవ పామ్ డి’ఓర్ అవార్డును లియోనార్డో డికాప్రియో అందజేశారు. ఈ ఫెస్టివల్‌కు ఆలియా భట్, లోరియల్ అంబాసిడర్‌గా కేన్స్ 2025లో తొలిసారి అడుగు పెట్టాల్సి ఉన్నప్పటికీ భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రారంభ కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు. తర్వాతి కార్యక్రమాలకు ఆలీయాభట్ వస్తారని నిర్వహకులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్ రెడ్డికి నో బెయిల్
ఈ వేడుకల్లె మనదేశం నుంచి ప్రదర్శించడానికి ఏ ఒక్క చిత్రం అర్హతా సాధించలేకపోయింది. అయితే 1970లో సత్యజిత్ రే తెరకెక్కించిన "అరణ్యేర్ దిన్ రాత్రి' చిత్రాన్ని కేన్స్ క్లాసిక్ విభాగంలో మే 19న ప్రదర్శిస్తారు. సినిమాలో గిరిజన అమ్మాయి దులిగా నటించిన సిమీ గరేవాల్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టనున్నారు. ఇండియా నుంచి తొలిరోజు బాలీవుడ్, టాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా జాదుగర్ డిజైన్ డ్రెస్సింగ్‌తో ఆహుతులను ఆకట్టుకుంది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. డార్క్ గ్రీన్ ట్యాబ్ గౌను, ధరించి యువరాణి లుక్‌లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read : సంచలన తీర్పు.. లైంగిక వేధింపుల కేసులో 8మందికి జీవిత ఖైదు
Also Read : క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
actress-alia-bhatt | janvi-kapoor | actress urvashi | france | cannes-film-festival
Follow Us