Actress Alia Bhatt : మీడియాపై ఆలియా భట్ ఫైర్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మీడియాపై ఫైర్ అయింది. కారు దిగి తన అపార్ట్మెంట్లోకి వెళ్తుంటే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఆమె వెనకాలే వెళ్లారు. రాకూడదని చెప్తున్నా వినకపోవడంతో.. ఫొటోగ్రాఫర్స్ పై ఆలియా అరుస్తూ..' ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్ బిల్డింగ్..' అని హెచ్చరించింది.