Thai Army: విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేసిన థాయ్ సైనికులు.. ఇండియా వార్నింగ్

కంబోడియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం వివాదాస్పదమైంది.

New Update
thailand

కంబోడియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం(demolishing Hindu statue) వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం (డిసెంబర్ 24) ఈ అంశంపై అధికారిక ప్రకటన చేశారు. 

Also Read :  బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా.. కారణం ఇదేనా..?

ప్రాదేశిక హక్కులు ఏవైనప్పటికీ, ఇలాంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత్ స్పష్టం చేసింది. "హిందూ, బౌద్ధ దేవతలు ఈ ప్రాంతంలోని ప్రజలందరిచే ఎంతో గౌరవించబడతారు. ఇది మన ఉమ్మడి నాగరికతకు సంబంధించిన వారసత్వం. ఇలాంటి పనులు జరగకూడదు" అని ఆయన పేర్కొన్నారు. హింసను వీడి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు సాంస్కృతిక వారసత్వానికి భంగం కలగకుండా చూడాలని ఇరు దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది.

Also Read :  డేటింగ్‌ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్

వివాదానికి నేపథ్యం:

థాయ్‌లాండ్, కంబోడియా మధ్య దాదాపు 800 కిలోమీటర్ల సరిహద్దు విషయంలో వందేళ్లుగా వివాదం నడుస్తోంది. తాజాగా విగ్రహం ఉన్న ప్రాంతం తమదంటే తమదని ఇరు దేశాలు వాదిస్తున్నాయి. ఈ విగ్రహాన్ని 2014లో తమ భూభాగంలోనే నిర్మించామని, థాయ్ సైన్యం ఉద్దేశపూర్వకంగానే దీన్ని ధ్వంసం చేసిందని కంబోడియా ఆరోపించింది. ఇది తమ భూభాగమని, సరిహద్దు ఒప్పందాల ప్రకారం వివాదాస్పద ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు ఉండకూడదనే కారణంతో థాయ్ సైన్యం విగ్రహాన్ని తొలగించింది. ఈ సరిహద్దు ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 80 మందికి పైగా మరణించగా, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. మతపరమైన చిహ్నాలను రాజకీయ, సరిహద్దు వివాదాల్లోకి లాగడం వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో భారత్ చేసిన వ్యాఖ్యలు ఆగ్నేయాసియా దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు