/rtv/media/media_files/2025/08/13/britain-govt-releases-26000-prisoners-serving-10-or-more-years-early-2025-08-13-21-26-28.jpg)
Britain Govt releases 26000 prisoners serving 10 or more years early
బ్రిటన్ ప్రభుత్వం(Britain Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. జైళ్లలో స్థలం లేక దాదాపు 26 వేల మంది ఖైదీలను(Prisoners) విడుదల చేసింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బ్రిటన్‌లో ఇప్పటిదాకా 26 వేల మంది ఖైదీలను విడుదల చేసినట్లు ఓ అంతర్జాతీయ కథనం వెల్లడించింది. సుధీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే జైళ్లు ఖైదీలతో నిడిపోయాయని.. వాటిని ఫ్రీగా మార్చేందుకు సాఫ్ట్ జస్టిస్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించినట్లు కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.
Also Read: వీధి కుక్కల తరలింపు తీర్పుకు బ్రేక్.. రేపు మరోసారి విచారణ
Britain Govt Releases 26000 Prisoners
ప్రభుత్వ విడుదల చేసిన డేటా ప్రకారం చూసుకుంటే 2024 సెప్టెంబర్ నుంచి 2025 మార్చి వరకు 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో 248 మందిని విడుదల చేశారు. ఈ ఖైదీల్లో 2600 మంది విదేశీయులుకు కూడా ఉన్నారు. కీర్ స్టార్మర్ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ కింద ప్రతీనెల సగటున 3461 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో 40 శాతం శిక్షను అనుభవించిన ఖైదీలనే ఎక్కువగా విడుదల చేశారు. 2025 పూర్తయ్యే లోగా దాదాపు 45 వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also Read: ధర్మస్థల కేసులో సంచలన అప్‌డేట్.. 13వ స్పాట్‌లో 8 మృతదేహలు
జైళ్ల నుంచి విడుదలైన ఖైదీలు ప్రధాని స్టార్మర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాము జీవితాంతం లేబర్‌పార్టీకి ఓటు వేస్తామని తెలిపారు. అయితే కొందరు ఖైదీలు తమకు వచ్చిన ఈ సువర్ణవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. విడుదలైన వెంటనే కొందరు మళ్లీ నేరాలకు పాల్పడినట్లు సమాచారం. మరోవైపు యూకేలో కొత్తగా 14 వేల జైళ్లను నిర్మిస్తున్నామని న్యాయశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈసారి జైళ్లలో స్థలం ఎక్కువగా ఉండే రీతిలో ప్రణాళిక వేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: దూసుకుపోతున్న పర్‌ప్లెక్సిటీ.. గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు భారీ ఆఫర్