Delhi in Stray Dogs: వీధి కుక్కల తరలింపు తీర్పుకు బ్రేక్.. రేపు మరోసారి విచారణ

ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలు అన్నింటిని 8 వారాల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను గురువారం పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. 

New Update
Dogs in delhi

Dogs

ఢిల్లీ, ఎన్‌సీఆర్(Delhi NCR) ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలు అన్నింటిని 8 వారాల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఢిల్లీలో వీధి కుక్కల వల్ల ఎక్కువగా రేబిస్ వంటి మరణాలు ఎక్కువగా అవుతున్నాయని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 8 వారాల్లోగా అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పలువురు ప్రముఖలు విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని, వాటికి టీకాలు వంటివి వేయించడం మంచిదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. ఇలా ఎక్కువగా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: UP: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..

షెల్టర్లు నిర్మించాలంటే..

ఢిల్లీ NCR ప్రాంతంలో సంఖ్యల్లో కుక్కలు(Delhi in Stray Dogs) ఉన్నాయి. కానీ వాటికి సరిపడా షెల్టర్‌లు లేవు. సరిపడా షెల్టర్‌ నిర్మించాలంటే ముందుగా కోట్లల్లో ఫండ్స్ కావాలి. వాటిని నిర్మించడానికి తగినంత సమయం కావాలి. అదేవిధంగా సరిపడా మ్యాన్‌ పవర్‌ లేకపోవడం, కుక్కలను తీసుకెళ్లకుండా స్థానికుల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. ఈవన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అవరోధంగా ఉన్నాయి. 2009 కుక్కల జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ, NCR ప్రాంతంలో 5.6 లక్షల కుక్కలు ఉన్నాయి. అప్పటి నుంచి కుక్కల జనాభాను లెక్కించలేదు. అయితే 16 ఏళ్ల కాలంలో కుక్కల సంఖ్య రెట్టింపు అయ్యిండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కుక్కల సంఖ్య 10 లక్షలకుపైనే ఉంటుంది. అయితే ప్రతీ 500 కుక్కలకు ఒక షెల్టర్‌ నిర్మించాలంటే దాదాపుగా రెండు వేల షెల్టర్లు కావాలి. అయితే ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కేవలం 20 షెల్టర్‌లు మాత్రమే ఉన్నాయి.

ఇది కూడా చూడండి: Sonia Gandhi: ఓట్ల చోరీ వివాదం.. సోనియాగాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు