Ukraine: ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్ మృతి..

ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్, న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్‌ ఇగోర్‌ కిరిలోవ్‌ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్‌మెంటు బయట ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Igor
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడిలో రష్యా లెఫ్టినెంట్‌ జనరల్,  న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్‌ ఇగోర్‌ కిరిలోవ్‌ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్‌మెంటు బయట ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఘటన చోటుచేసుకుంది. ఇగోర్‌ కిరిలోవ్‌తో పాటు తన అసిస్టెంట్‌ కూడా ఈ బాంబు దాడిలో మరణించాడు. ఈ హత్యకు తామే బాధ్యులమని సెక్యూరిటీ సర్వీసెస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ వెల్లడించింది. 
అయితే ఉక్రెయిన్‌ సైనికులపై నిషేధించబడిన రసాయన ఆయుధాలను వినియోగించేందుకు ఇగోర్‌ కిరిలోవ్‌ పర్మిషన్లు జారీ చేశారని ఇటీవలే ఉక్రెయిన్ ఆరోపణలు చేసింది. ఆయన్ని యుద్ధ నేరస్థుడిగా పరిగణిస్తున్నామని ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అతడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. చివరికి ఈ దాడిలో కిరిలోవ్‌తో పాటు ఆయన సహాయకుడు కూడా మృతి చెందారు. దాదాపు మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంమలో రష్యా కోల్పోయిన అత్యంత సీనియర్ స్థాయి అధికారి ఈయనే. అంతేకాదు ఇటీవలే రష్యాకు చెందిన ఓ ఆయుధాల నిపుణులు కూడా తన సొంత ఇంట్లో హత్యకు గురయ్యాడు. 
ఇదిలాఉండగా.. ఇగోర్‌ కిరిలోవ్‌ 2017 నుంచి రష్యా న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళానికి చీఫ్‌గా ఉన్నారు. ఉక్రెయిన్‌ సైన్యంపై నిషేధిత రసాయనాలను విడుదల చేస్తున్నారని.. దీని ప్రభావం వల్ల అనేకమంది అనారోగ్యం పాలయ్యారని ఉక్రెయిన్ భద్రతా విభాగం ఎస్‌బీయూ గతంలోనే పేర్కొంది. దీంతో కిరిలోవ్‌పై బ్రిటన్‌ కూడా ఆంక్షలు విధించింది. రష్యా తరఫున అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తిగా ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలను వినియోగిస్తున్నామనే వార్తలను రష్యా ఖండిస్తోంది. ఉక్రెయిన్‌ సైన్యం కూడా ఇలాంటి దాడులకు ప్రయత్నాలు చేస్తూందటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు