దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నికను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ ద్వారా జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్ ముందు తీసుకొచ్చారు. ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా బిల్లును ఉపసంహరించుకోవాలని.. ఈ బిల్లుకు టీడీపీ పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీతో పాటు మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేళ్లు ఉంటుంది. అదే జమిలి ఎన్నికలు దేశంలో నిర్వహిస్తే.. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి కాకుండానే కొన్ని ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా జమిలి ఎన్నికలు 2027 లో నిర్వహించే అవకాశం ఉందని ఎక్కువగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే పూర్తి స్థాయిలో చట్టాలు తీసుకురావడానికి సమయం పడుతుంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందు.. ఆరు నెలల తర్వాత జరిగే వాటిని కలిపి 2029లో పాక్షికంగా నిర్వహిస్తారట. వీటినే పాక్షిక జమిలి ఎన్నికలు అంటారు. అయితే పూర్తి స్థాయిలో 2034లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్ ఇదిలా ఉండగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1951లో ఎన్నికలు జరిగాయి. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగాయి. ఈ సమయంలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు దేశమంతటా ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా దేశంలో జమిలి ఎన్నికలే జరిగాయి. ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!