/rtv/media/media_files/2026/01/24/fotojet-12-2026-01-24-11-55-09.jpg)
US winter storm
America In Danger : అగ్రరాజ్యం అమెరికా పై ప్రకృతి పగబట్టింది. మంచు ప్రళయం ఇప్పుడా ఆ దేశాన్ని వణికిస్తుంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు దాదాపు రెండు వేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను(US winter storm) దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. దేశంలో దాదాపు మూడింట రెండొంతుల రాష్ట్రాలపై (ప్రధానంగా తూర్పు వైపున) ఈ తుపాను శుక్రవారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి పంజా విసురుతంది! దీని ప్రభావంతో టెక్సాస్, ఓక్లహోమా తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగే ముప్పుంది.
Also Read : జాబిల్లి నవ్వింది..నిన్న ఆకాశంలో అద్భుతం..త్రిగ్రహ సంయోగం..
Blizzard Is Shaking America
తుపాను నేపథ్యంలో శుక్రవారం డాలస్(dallas), అట్లాంటా(atlanta), ఓక్లహోమా సహా పలు విమానాశ్రయాల్లో 800కు పైగా విమానాల రాకపోకలు ఆలస్యమవడం, రద్దవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారాంతంలో తుపాను ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే వర్షంకారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయి లక్షలాది ఇళ్లు చీకటిలో మగ్గిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిన్నెసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 46 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతాయని చెబుతున్నారు. మంచు బీభత్సం సృష్టించే ముప్పుండటంతో జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆత్యయిక స్థితి ప్రకటించారు. అమెరికాలో దాదాపు 16 కోట్ల నుంచి 23 కోట్ల మందిపై ఈ తుపాను ప్రభావం ఉంటుందని అంచనా. పరిస్థితి తీవ్రతను గమనించిన పలు రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/24/fotojet-13-2026-01-24-11-55-46.jpg)
Also Read : అమెరికాలో దారుణం..ఇమిగ్రేషన్ అధికారుల నిర్బంధంలో ఐదేళ్ల పాప
ఈ మంచు బీభత్సం కారణంగా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలింది. పొగమంచు వల్ల రహదారులు కనిపించక మిచిగాన్ వంటి ప్రాంతాల్లో వందకు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం గ్రాండ్ రాపిడ్స్ సమీపంలోని హడ్సన్‌విల్లే దగ్గర జరిగింది. ఢీకొన్న వాహనాల్లో 30కి పైగా పెద్ద లారీలు, సెమీ ట్రక్కులు ఉన్నాయి. మంచు వల్ల రోడ్లు జారుడుగా మారడంతో వాహనాలు అదుపుతప్పి ఒకదానిపైకి ఒకటి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో చాలా మందికి గాయాలు కాగా.. ఎవరూ చనిపోలేదు. ​ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హైవేను రెండు వైపులా మూసివేశారు. రోడ్డు మీద చిక్కుకుపోయిన ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించి దగ్గర్లోని హడ్సన్‌విల్లే హైస్కూల్‌కు తరలించారు. కేవలం మిచిగాన్ మాత్రమే కాదు, అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. మిన్నెసోటా, విస్కాన్సిన్, ఇండియానా, ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
​ఎప్పుడూ వేడిగా ఉండే ఫ్లోరిడా(florida) లో కూడా మంచు కురిసింది. దింతో చికాగోలో జరుగుతున్న ఫుట్‌బాల్ గేమ్ కష్టంగా మారింది. ఫ్లోరిడా, జార్జియా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చలిగాలుల ధాటికి ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. బయటకు వస్తే కేవలం పది నిమిషాల్లోనే చర్మం గడ్డకట్టే ప్రమాదం ఉండటంతో చికాగో, డెమాయిన్ వంటి నగరాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఈ తుఫాను ప్రభావం న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ఈశాన్య నగరాలపై మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడ దాదాపు ఒక అడుగు మేర మంచు కురిసే అవకాశం ఉంది. భారీ హిమపాతం కారణంగా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Follow Us