/rtv/media/media_files/2026/01/24/fotojet-14-2026-01-24-12-39-22.jpg)
Food Poisoning
Food Poisoning: అనంతపురం(Anantapur) జిల్లా కణేకల్లు మండలంలోని 43.ఉడేగోళం ప్రాథమిక పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 129 మంది విద్యార్థులకు గాను 116 మంది పాఠశాలకు హాజరై మధ్యాహ్న భోజనం తిన్నట్లు హెచ్ఎం తెలిపారు. మెనూ ప్రకారం అన్నం పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి తిన్నారు. మధ్యాహ్న భోజన అనంతరం ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్న పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈక్రమంలో పాఠశాల నుంచి ఇంటికి చేరుకున్న విద్యార్థులు సాయంత్రం 7గంటల సమయంలో వాంతులు(Vomiting) కావడంతో ఫుడ్ పాయిజన్(Students Food Poisoning) కు గురైనట్లు తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఎవరికి వారుగా, ఆటోలు, ద్విచక్ర వాహనాలలో చికిత్స నిమిత్తం కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: అమెరికాను వణికిస్తున్న మంచుతుపాన్ ..డేంజర్ లో 16 కోట్ల మంది
పరీక్షించిన వైద్యులు
వాంతులతో( Vomiting ) బాధపడుతున్న విద్యార్థులకు వైద్యులు షరీఫ్, అబ్దుల్ సలామ్ సెలెన్ ఎక్కించి చికిత్సలు అందించారు. సమాచారం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం నారాయణస్వామి, ఎస్సై నాగమధు, డీటీ విశ్వనాథ్, తెదేపా, వైసీపీ నాయకులు విద్యార్థులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులను అడిగి విద్యార్థుల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు విద్యార్థులకు వాంతులు ఎక్కువ కావడంతో వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అందరూ కోలుకున్నాక రాత్రి 11గంటల సమయంలో విద్యార్థులను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఎండలో ఎక్కువ సేపు అడుకోవడంతో డీహైడ్రేషన్ గురైనట్లు లక్షణాలు కనిపిస్తున్నాయని. పాయిజన్ కూడా కారణమై ఉండవచ్చని భావిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
Follow Us