/rtv/media/media_files/2026/01/24/fotojet-15-2026-01-24-13-44-42.jpg)
Medaram
Medaram: ములుగు జిల్లా(Mulugu District) మేడారం జాతర పరిసరాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం మహాజాతర( Medaram Sammakka Sarakka Jatara ) మరో ఐదు రోజులే ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవార్లకు చీర, సారె, ఎత్తు బంగారం సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున మేడారం తరలివస్తు న్నారు. మహా జాతరను(MEDARAM JATHARA) తలపించేలా ప్రధాన కూడళ్లు, గద్దెలు, జంపన్నవాగు స్నాన ఘట్టాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, విడిది చేసే అటవీ ప్రాంతాల్లో భక్తజనం పెద్ద ఎత్తున నిండిపోయారు. లక్షలాదిగా తరలివచ్చిన జనంతో మేడారం భక్తజన గుడారంగా మారిపోయింది.
Also Read: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..
Medaram Jatara - 2026
శనివారం 3 లక్షల మందికి పైగా భక్తులు ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల్లో మేడరానికి తరలివచ్చారు. దీంతో రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్ల లో భక్తులు క్యూలైన్ల ద్వారా తమ ఎత్తు బంగారం(బెల్లం) నెత్తిన మోస్తూ కాలినడకన దేవస్థానంలోని తల్లుల గద్దెలకు చేరుకున్నారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలలో చీరె, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, ఒడిబియ్యం, యాట మొక్కులను చెల్లించుకుని తల్లీ సల్లంగా చూడు.. మహా జాతరకు వస్తాం అని వేడుకున్నారు.
Also Read: అమెరికాను వణికిస్తున్న మంచుతుపాన్ ..డేంజర్ లో 16 కోట్ల మంది
Medaram Sammakka Sarakka Jatara
మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ములుగు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వస్రా, తాడ్వాయి పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు.గతంలో తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులతోపాటు గద్దెల వద్ద క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. బస్టాండ్ తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా పోలీసులకు, వాలంటీర్లకు, అధికారులకు భక్తులు సహకరించాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.
Follow Us