Cricket : మూతికి కుట్లు.. తీవ్రమైన నొప్పి.. అయినా జట్టుకోసం బరిలోకి..! తమిళనాడు క్రికెటర్‌కి క్రీడా లోకం సెల్యూట్!
విజయహజరే ట్రోఫీ సెమీస్‌లో బాబా ఇంద్రజిత్ పట్టుదలకు, తెగింపుకు యావత్ క్రీడా లోకం సెల్యూట్ చేస్తోంది. మూతికి బలమైన గాయమైనా.. రక్తం కారుతున్నా.. నోటికి టేప్ వేసుకోని వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు ఇంద్రజిత్. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంద్రజిత్ బాత్రూమ్లో జారి పడ్డాడు.