/rtv/media/media_files/2025/08/29/pm-modi-vladimir-putin-2025-08-29-21-38-04.jpg)
PM Modi, Vladimir Putin
Putin Visit To India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. ఈ డిసెంబర్‌లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. క్రెమ్లిన్ సహాయకుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై పలు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ సోమవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ పర్యటనకు సన్నాహాలపై చర్చిస్తారని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ స్పష్టం చేశారు. గతంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. " రష్యాతో మాకు ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం ఉంది, ఈ బంధానికి మేము విలువ ఇస్తున్నాము" అని డోవల్ ఈ సందర్భంగా అన్నారు.
Also Read: Karimnagar : ఎంత మంది గోసనో.. ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊర్లో సంబరాలు!
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రష్యా నుండి తక్కువ ధరకు చమురు కొని, భారత్ దానిని బహిరంగ మార్కెట్‌లో అధిక లాభాలకు అమ్ముకుంటుందని ట్రంప్ ఆరోపించారు. "ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ యంత్రం ఎంత మందిని చంపుతుందో వారికి పట్టదు" అని ట్రంప్ ఆరోపించారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆపడానికి మాస్కోపై ఒత్తిడి పెంచడానికి భారత్ పై ఈ ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా వాదించింది. ఈ చర్యను ఖండిస్తూ భారత్ "అన్యాయం, అసంబద్ధం" అని పేర్కొంది. రష్యా నుండి అమెరికా, యూరప్ దేశాలు కూడా చమురు దిగుమతులు చేసుకుంటున్నాయని భారత్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దాడి తర్వాత రష్యా తన ఇంధన అమ్మకాలను ఐరోపా నుండి భారత్, చైనా వంటి దేశాలకు మరల్సాంది. దీంతో బిలియన్ల డాలర్ల నిధుల ప్రవాహం కొనసాగుతోంది. దీన్ని ట్రంప్ జీర్ణించుకోలేక పోతున్నాడు.
ఇదిలా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను జరిపిన సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే భారతదేశ వైఖరిని ప్రధాని మోదీ పుతిన్‌కు స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించుకున్నట్లు మోదీ తెలిపారు.
Also Read:మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?