Adani Group: అవినీతి కేసులో అదానీకి ఊరట...ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.  

author-image
By Manogna alamuru
New Update
usa

Goutam Adani, Donald Trump

Adani Group: అదానీ నెత్తిన పాలు పోశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump). అతని మీద ఉన్న కేసులు తప్పేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్-ఎఫ్‌సీపీఏను నిలిపివేయాలని అమెరికా న్యాయ శాఖను ఆదేశించారు. 50 ఏళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. దీంతో అదానీ గ్రూప్ కు చాలా పెద్ద రిలీఫ్ వచ్చినట్టయింది. ఈ కారణంతో నిన్న స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ పైకెగసి లాభాలు ఆర్జించాయి.

లంచం ఆరోపణలు.. 

భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై  అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు భారీగా లంచం ఇచ్చారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్ఈసీఐతో 12 జీడబ్ల్యూ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని  ఆరోపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కేసులు పెట్టారు అదానీ గ్రూప్ మీద. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది.

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

అమెరికాలో ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ అనే చట్టం ఉంది. 50 ఏళ్ళ క్రితం దీనిని ప్రారంభించారు. అయితే కొంతకాలం క్రితం దీన్ని మరింత కఠినతరం చేశారు.  చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేశారు. ఇదే అదానీ గ్రూప్ మెడకు చుట్టుకుంది. దీని ప్రకారం అమెరికాలో ఎవరైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా, నిధులు సమీకరించాలి అనుకున్నా వారికి క్లీన్ రికార్డ్ ఉండాలి. అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే వాళ్ళు ఏ ఆర్ధిక నేరాలకు పాల్పడలేదు అని రికార్డ్ ఉండాలి. అమెరికా నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏ కంపెనీ అయినా తమను అప్రోచ్ అయ్యాక అమెరికా చట్ట ప్రకారం ఇవన్నీ పరిశీలిస్తారు. అమెరికాలో వ్యాపారం చేసే ముందు ఈ యాక్ట్ మీద సంతకం పెట్టించుకుంటారు. అలా సంతకం చేసిన తర్వాత తప్పులు బయటపడ్డాయో కేసులు వేసేస్తారు. ఇప్పుడు అదానీ కంపెనీ విషయంలో అదే జరిగింది. 

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

ముందే ఊహించినదే..

అయితే అదానీపై కేసుల విషయంలో ఈ ఊరట...ఇంతకు ముందు నుంచీ ఊహిస్తున్నదే. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అదానీ మీద కేసులు కొట్టేస్తారని ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. స్వయంగా ట్రంప్ కు అదానీ చాలా దగ్గర సంబంధం ఉండడం ఒకటి కాగా...ప్రధాని మోదీ, అదానీకి ఉన్న స్నేహం వలన కూడా ఆయనపై కేసులు కొట్టేస్తారని అంచనాలు వెలువడ్డాయి. దానికి తగ్గట్టే ఇప్పుడు ట్రంప్ ఏకంగా 50 ఏళ్ళ నాటి చట్టాన్నే నిలిపివేయలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు అదానీపై కేసులతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వం కూడా చిక్కుల్లో పడ్డట్టయింది. అదానీ.. జగన్ కు రూ.1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని చెప్పారు. 021-24 మధ్య కాలంలో అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంతో పాటు మరో 5 రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించింది. అందులో రూ. 1750 కోట్లు ఏపీ ప్రభుత్వ వ్యక్తికి చెల్లించినట్లు వెల్లడించింది.   

 

Also Read :  బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు