Trump: నాకేం తెలియదు..నేనలా అనలేదు..ట్రంప్ రెండు నాలుకలు

రష్యా నుంచి అమెరికా యురేనియం తదితరాలు దిగుమతి చేసకుంటుందని భారత్ ఆరోపించింది. దీనిపై అమెరికా అధ్యక్షుటు ట్రంప్ నాకేం తెలియదు అంటూ తప్పించుకున్నారు. పైగా భారత్ పై అదనపు టారీఫ్ లగురించి నేనేమీ చెప్పలేదే అంటూ బుకాయించారు. 

New Update
d trump

Donald Trump

అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ విషయంలో కూడా అదే చేశారు. ఒకసారి తానే కారణమని..ఇంకోసారి నేనలా చెప్పలేదని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు. అవి ఆపకపోతే 24 గంటల్లో అదనపు టారీఫ్ లు విధిస్తామంటూ బెదిరించారు.  అయితే ఈరోజు దాని గురించి అడగ్గా నేనలా చెప్పలేదే అంటూ మాట మార్చారు. టారీఫ్ లు, శాతాలు గురించి నేనే మాట్లాడలేదని బుకాయించారు. తానెప్పుడు పర్శంటేజ్ ల గురించి మాట్లాడలేదని..టారీఫ్ లపై ఇంకా కరత్తులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ట్రంప్. తొందరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బుధవారం నాడు రష్యాతో మీటింగ్ ఉందని...దాని తరువాత నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఏం జరుగుతుందో చూడాలి అంటూ వ్యాఖ్యానించారు. 

అబ్బే నాకు తెలియదు..కనుక్కుంటాను..

మరోవైపు అమెరికా అధ్యక్షుడు టారీఫ్ ల బెదరింపులకు భారత్ ధీటుగా జవాబిచ్చింది. అమెరికా రష్యా తో చేస్తున్న వ్యాపారాల గురించి మాట్లాడాలంటూ ప్రశ్నించింది. ఆ దేశం నుంచి యురేనిం, ఎరువుల దిగుమతి సంగతేటో తేల్చాలని భారత్ అడిగింది. దీనిపై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. రష్యాతో వ్యాపారం గురించి అసలు తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. భారత్ చెప్పాకనే తెలిసిందని..ఇప్పుడు వాటి గురించి తెలుసుకుంటానని చెప్పారు. త్వరలోనే రష్యాతో వాణిజ్యం గురించి సమాధానమిస్తానని అన్నారు. 

అమెరికాపై భారత్ విరుచుకుపడింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలిని విమర్శించింది. భారత్ ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని..జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ తెలిపింది. దాని కోసం అమెరికా భారత్ మీద వత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పింది. అమెరికా, రష్యాల మధ్య వివాదంలోకి భారత్ ను తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించి అమెరికానే ఇప్పుడు వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టింది. అయితే ట్రంప్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ దేశాలు యుద్ధ ఇంజిన్ కు ఇంధనాన్ని అందిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అందుకే భారత్ పై అదనపు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే చైనాకు మాత్రం 90 రోజులు సుంకాల నుంచి గడువు ఇచ్చారు.  చైనా కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలను సొంత పార్టీలోని వారితో పాటూ ప్రపంచ దేశాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. 

Also Read: Terror Alert: ఇండియాలో ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు..భద్రత పెంపు

Advertisment
తాజా కథనాలు