California Fire: కాలిఫోర్నియాలో వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు..65 వేల ఎకరాలకు పైగా మంటల్లో..

అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఆరు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడి గాలి నాణ్యత క్షీణిస్తోంది. చాలాచోట్ల ప్రజలను తరలిస్తున్నారు. 

New Update
california

California Fire

ఈ నెల 1న కాలిఫోర్నియాలో కార్చిచ్చు మొదలైంది. అప్పటి నుంచి  అవి ఆరకుండా మండుతూ ఉండడమే కాకుండా వేంగా వ్యాపిస్తున్నాయి. గిఫోర్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్చిచ్చు ఇప్పటికే 72 వేల ఎకరాలకు పైగా విస్తరించింది. భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. దాంతో పాటూ దట్టమైన పొగ కూడా చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపిస్తోంది. లాస్‌ ఏంజెలెస్, వెంచురా, కార్న్‌ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతో పాటు పొరుగున ఉన్న లాస్‌వేగాస్‌లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శాంటామారియా లాంటి ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు , దట్టమైన పొగ వలన అక్కడ గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. 

మంటలను అదుపు చేసేందుకు కాలిఫోర్నియా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 1000కు పైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  అయితే ఇప్పటికి 3 శాతం మాత్రమే అదుపు చేయగలిగారు. కార్చిచ్చు కారణంగా చాలా చోట్ల రహదారులను మూసేశారు. ఇది మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన వేడి పెరొగచ్చని అంచనా. ఇప్పటి వరకు కార్చిచ్చు కారణంగా ముగ్గురు గాయపడ్డారు. 

అంతకు ముందు జనవరిలో..

అంతకు ముందు ఇదే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు తగలబెట్టేసింది. దాదాపు 20 రోజులు నగరాన్ని కార్చిచ్చు దహించేసింది. ఇందులో 50 మందికి పైగా చనిపోయారు. 92 వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. 19 వేల కంటే ఎక్కువ నివాసాలు కాలా బూడిద అయ్యాయి. లాస్ ఏంజెలెస్‌లో పెద్ద పెద్ద భవనాలు, అట్రాక్షన్స్ అన్నీ మంటలకు ఆహుతి అయ్యాయి. ఇప్పటి వరకు 40 వేల ఎకరాలను మంటలు కాల్చేశాయి. లాస్ ఏంజెలెస్ లోని హాలీవుడ్ సైతం మంటలకు నాశనం అయిపోయింది. దీని కారణంగా చాలా  సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ప్రముఖుల ఇళ్ళు కాలిపోయాయి. ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ సైతం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అమెరికాలోని వివిధ ఏజెన్సీల డేటా ప్రకారం.. 2025 జనవరి 6 నుంచి లాస్ ఏంజిల్స్‌ని దహిస్తున్న కార్చిచ్చు అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అగ్ని ప్రమాదం కావచ్చని చెబుతున్నాయి. వైల్డ్ ఫైర్ కారణంగా 135 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్లు అంటే సుమారు 11-13 లక్షల కోట్ల నష్టం సంభవించింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో యుపి, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ బడ్జెట్‌తో సమానం. యూపీ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు, బీహార్ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉంది. ఢిల్లీ బడ్జెట్ చూస్తే రూ.76 వేల కోట్లు. 4 రాష్ట్రాల బడ్జెట్ అంత ఆస్తినష్టం జరిగిందని అంచనా.

Also Read: Israel: గాజా స్వాధీనానికి నెతన్యాహు ప్లాన్..ఆపాలని ట్రంప్ కు లేఖ రాసిన ఇజ్రాయెల్ మాజీలు, నేతలు

Advertisment
తాజా కథనాలు