China: చైనాలో సుడిగాలి బీభత్సం.. ఐదుగురు మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సుడిగాలి ప్రభావానికి 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.