IndiGo Effect: విమాన ప్రయాణికులకు ఉపశమనం.. రైళ్లలో 116 అదనపు కోచ్‌లు

గడచిన నాలుగైదు రోజులుగా దేశంలో ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర విమానాల ప్రయాణాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియన్‌ రైల్వే రంగలోకి దిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 రైళ్లకు ఏకంగా 116 అదనపు కోచ్‌లను జోడించింది.

New Update
FotoJet - 2025-12-06T132327.783

Relief for air passengers.. 116 additional coaches in trains

IndiGo Effect:గడచిన నాలుగైదు రోజులుగా దేశంలో ఇండిగో విమాన సేవల్లో(indigo airlines flight) అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర విమానాల ప్రయాణాల్లోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.  దేశీయ సర్వీస్ ప్రొవైడర్ ఇండిగో తన విమాన సర్వీసుల రద్దు(IndiGo Flight Cancellation) చేయటంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ, వారి అసౌకర్యాన్ని తీర్చేందుకు ఇండియన్‌ రైల్వే రంగలోకి దిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్స్ రద్దు  సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 ప్రీమియం రైళ్లకు ఏకంగా 116 అదనపు కోచ్‌లను జోడించింది. ఈ కోచ్‌లను మొత్తం 114 ట్రిప్పుల వరకు పెంచడం ద్వారా రైల్వేల సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లయింది.

Also Read: HIV వైరస్ AIDSగా మారడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది..? డేంజర్ ఎప్పుడు అవుతుంది..?

IndiGo Effect - Additional Coaches In Trains

ఈ అదనపు కోచ్ ల సేవలు 2025 డిసెంబర్ 6వ తేదీ నుంచి అంటే నేటి నుంచే అమల్లోకి వచ్చాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా విమానాలు రద్దై ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్న సమయంలో పలువురు ప్రయాణీకులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం వేలాది మంది ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించింది. అదనపు కోచ్‌ల పెంపులో దక్షిణ రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ రైల్వే ఏకంగా 18 రైళ్లల్లో తన సామర్థ్యాన్ని పెంచింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రత్యేకంగా చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను కూడా అదనంగా ఏర్పాటు చేసింది.

Also Read: పుతిన్‌కి చేతికి మొసలి తోలు గడియారం; ధర వింటే షాక్ అవుతారు

దక్షిణ రైల్వే(indian-railways) తర్వాత.. నార్తన్ రైల్వే ఎనిమిది రైళ్లలో 3AC, చైర్ కార్ కోచ్‌లను జోడించడంతో ఉత్తర కారిడార్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ రైల్వే లో  అధిక-డిమాండ్ ఉన్న నాలుగు రైళ్లకు 3AC, 2AC కోచ్‌లను యాడ్ చేసింది. దీనివల్ల  దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వైపు ప్రయాణికుల రద్దీ తాకిడి తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. చివరిగా తూర్పు మధ్య రైల్వేసైతం రాజేంద్ర నగర్ - న్యూ ఢిల్లీ సర్వీసుకు అదనపు 2AC కోచ్‌లను జోడించింది. కాగా డిసెంబర్ 6 నుండి 10వ తేదీల మధ్య ఐదు ట్రిప్పుల పాటు ఈ అదనపు సేవలు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. బీహార్- ఢిల్లీ మార్గంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. విమాన సేవల రద్దుతో ఏర్పడిన అసాధారణ రద్దీని యుద్ధప్రాతిపదిక చర్యలతో సమర్థవంతంగా తీర్చుతుంది భారతీయ రైల్వే వ్యవస్థ.    

Advertisment
తాజా కథనాలు