/rtv/media/media_files/2025/02/18/H8dkDWypw4ISuqcKoHWE.jpg)
crisis
అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్గానిస్తాన్, సిరిమా, యెమెన్ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం.
Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
America Food Boycott
డోజ్ లోని యూఎస్‌ఎయిడ్ వ్యవహారాలను చూసే జెరెమీ లూవిన్ ఈ ఆదేశాలిచ్చారు అంటూ భాగస్వాములకు పంపిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.దీనికి సంబంధించి దాదాపు 60 కి పైగా లేఖలు వివిధ విభాగాలకు గత వారం రోజుల్లో అందాయి.అమెరికా నిర్ణయం పై ప్రపంచంలో అతి పెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుంది.వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయని తన ఎక్స్ పేజీలో పేర్కొంది.ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఙప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయం పై ట్రంప్ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.ఇప్పటి దాకా చేసిన సాయానికి కృతజ్ఙతలు తెలిపింది.
కోతల నుంచి ఆహారంతో పాటు ప్రాణాధార అత్యవసర సాయాలను మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు ప్రభుత్వ అధికారులు గతంలోనే హామీ ఇచ్చారు. అయితే సోమవారం ఆయన కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
latest telugu news updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu