రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనపై 50 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్యపరంగా ప్రయాత్నాలు చేస్తూనే ఉంది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చాలాసార్లు చెప్పింది. తాజాగా జెలెన్‌స్కీ భారత్‌కు వ్యతిరేకంగా అమెరికాను సపోర్ట్ చేస్తూ మాట్లడటం చర్చనీయాంశమవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే జెలెన్‌స్కీ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అమెరికా టారిఫ్‌ల అంశం గురించి మాట్లాడారు. రష్యాతో వ్యాపారా లావాదేవీలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించడం మంచి చర్యేనని వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్, పుతిన్ అలాస్కాలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు విఫలం కావడంతో రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఇలాంటి సమయంలో జెలెన్‌స్కీ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: వినాయక చవితికి దేశవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిందో తెలుసా?
'' ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని సపోర్ట్ చేసేవాళ్లపై ఆంక్షలు విధించే బాధ్యత మాదే. భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొంటూనే ఉంది. దీనిపై స్పందించేందుకు మేము రెడీగా ఉన్నాం. ఆంక్షల స్థాయి గురించి ప్రస్తుతం, రాబోయే రోజుల్లో మాట్లాడుకుంటారని'' నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ట్ అన్నారు. అలాగే రష్యాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఇదిలాఉండగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ కూడా యత్నిస్తోంది. ప్రధాని మోదీ పుతిన్‌తో పాటు, జెలెన్‌స్కీతో కూడా చర్చలు జరుపుతున్నారు. గత నెలలో రెండో వారంలో పుతిన్‌తో సమావేశానికి ముందు జెలెన్‌స్కీతో మట్లాడారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో కూడా ట్వీట్ చేశారు. '' రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని త్వరగా, శాంతియుతంగా పరిష్కరించాలని భారత్ వైఖరి గురించి జెలెన్‌స్కీకి తెలియజేశాను. యుద్ధం ముగించేందుకు సాధ్యమైనంత సహకారాన్ని అందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం కోసం కట్టబడి ఉన్నామని'' రాసుకొచ్చారు. యుద్ధం విషయంలో ఉక్రెయిన్ భారత్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ.. తాజాగా జెలెన్‌స్కీ అమెరికా టారిఫ్‌లు విధించడం సరైందేనని చెప్పడం గమనార్హం.
Zelensky: భారత్‌కు వ్యతిరేకంగా జెలెన్‌స్కీ.. అమెరికాకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా అమెరికాను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
Zelensky on Trump slapping tariff on India for buying Russian oil