/rtv/media/media_files/2025/08/20/alaska-man-gifted-motorcycle-by-russian-government-2025-08-20-16-06-20.jpg)
Alaska man gifted $22,000 motorcycle by Russian government, Know Details
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) విషయంలో ఇటీవల అలాస్కా(Alaska) లో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ నేపథ్యంలో ఓ కీలక పరిణామం జరిగింది. పుతిన్.. అలాస్కాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.19 లక్షల విలువైన బైక్‌ను గిఫ్డ్‌గా ఇచ్చారు. రష్యాలో తయారైన ఉరల్ బైక్‌ను అతడు వినియోగించడం వల్లే పుతిన్ అతడికి ఈ బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి ట్రంప్, పుతిన్ భేటీకి ముందు అలస్కాకు రష్యన్ మీడియా ప్రతినిధులు వెళ్లారు. అక్కడి స్థానికులతో ముచ్చటించారు. అయితే అదే సమయంలో ఉరల్ కంపెనీకి చెందిన ఓ పాత బైక్‌ను మార్క్ వారెన్ అనే ఓ స్థానికుడు వాడుతున్నాడు.
అతడిని చూసిన రష్యా జర్నిలిస్టులు ఫొటోలు, వీడియోలు తీశారు. ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ బైక్ గురించి వారెన్ వాళ్లకి వివరించారు. ఆ బైక్ అంటే తనకు చాలా ఇష్టమని .. కాని యుద్ధం వల్ల ఆ బైక్ విడిభాగాలు దొరకడం లేదంటూ వాపోయాడు. దీనికి సంబంధించిన న్యూస్ రష్యాలో వైరల్ అయ్యింది. రష్యాకు చెందిన బైక్‌ను అతడు వాడుతుండటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం పుతిన్ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో రష్యా అధికారులు వారెన్‌కు ఫోన్ చేశారు. తన బైక్ గురించి ఆందోళన చెందవద్దని చెప్పారు.
Alaska Man Gifted $22,000 Motorcycle By Russian Government
ఈ క్రమంలోనే పుతిన్ అలస్కాకు వచ్చిన విమానంలోనే అధికారులు రూ.19 లక్షల విలువైన కొత్త బైక్‌ను తీసుకొచ్చారు. అమెరికా అధికారుల సాయంతో ఆ బైక్‌ను స్థానిక రాయబార కార్యాలయానికి తరలించారు. అయితే ట్రంప్(Donald Trump), పుతిన్(Putin) సమావేశం పూర్తయిన మరుసటి రోజే అధికారులు వారెన్‌కు ఎంబసీ వద్ద ఆ బైక్‌ను అప్పగించారు. రష్యా అధ్యక్షుడు మీకు బహుమానం ఇచ్చారంటూ చెప్పారు. దీంతో అతడు ఆనందంలో మునిగితేలాడు. తనకు పాత బైక్ కూడా ఇష్టమేనని కొత్త బైక్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. రష్యాలో తనకు ఎవరూ తెలియదని.. అయినాకూడా తనకు ఇంత ఖరీదైన బైక్‌ను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పుతిన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో ఓ లేఖ రాస్తానని కూడా చెప్పాడు. పుతిన్ కూడా గతంలో ఇలాంటి బైక్‌ను నడిపినట్లు తెలుస్తోంది.
In Anchorage, Mark Warren, unable to get parts for his Russian ‘Ural’ bike due to sanctions, got a surprise gift — a new motorcycle from Putin via Russian diplomats. pic.twitter.com/8yBict3nqK
— Polymarket Intel (@PolymarketIntel) August 18, 2025
1941లో రష్యాలోని పశ్చిమ సైబీరియాలో ఉరల్ మోటార్ సైకిల్ కంపెనీని స్థాపించారు. దీని విడిభాగాలు మాత్రం కజకిస్థాన్‌లో తయారుచేస్తారు. అక్కడినుంచి వాషింగ్టన్‌లోని వుడిన్‌విల్‌కు తరలిస్తారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వాహనం పరికరాలు సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడింది. పుతిన్.. వారెన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్ ఆగస్టు 12నే తయారుచేసినట్లు తెలుస్తోంది.
Also Read: ట్రంప్‌ది పెద్ద ప్లానే.. భారత్-రష్యా స్నేహాన్ని వాడుకొని యుద్ధానికి ముగింపు!