Russia Ukraine War: ట్రంప్‌ది పెద్ద ప్లానే.. భారత్-రష్యా స్నేహాన్ని వాడుకొని యుద్ధానికి ముగింపు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు భారత్‌పై ఆంక్షలు విధించారు. దీనిలో భాగంగా, భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు సుంకం విధించారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాన్ని రెట్టింపు చేస్తూ మొత్తం 50 శాతానికి పెంచారు.

New Update
Russia over Ukraine war

Russia Ukraine War

ఊరికనే అమెరికా అగ్రరాజ్యం కాలేదు. ఎత్తులు.. నక్క జిత్తులు, ప్లాన్లు, పన్నాగాలు అన్నీ తెలిసి ఉంటేనే ప్రపంచంలో అగ్రదేశంగా నిలవగలిగేది. ఎక్కడ స్విచ్ వేస్తే కరెక్ట్ బల్బ్ వెలుగుతుందో అమెరికాకు బాగా తెలుసు. అమెరికా వైట్‌హౌస్ సరిగ్గా అదే స్విచ్ వేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతుంది. 2022 నుంచి జరుగుతున్న మారణకాండకు పుల్‌స్టాప్ పెట్టేందుకు అమెరికా ప్లాన్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచే చర్యలలో భాగంగానే భారత్‌పై సుంకాలు విధించినట్లు అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు సుంకం విధించారు. ఇదివరకే ఉన్న 25 శాతం సుంకాన్ని రెట్టింపు చేస్తూ మొత్తం 50 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం ఆగస్టు 27 నుంచి అమలులోకి రానుంది.

వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో లీవిట్ మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తూ, రష్యా ఆర్థికంగా బలపడడానికి భారత్ పరోక్షంగా సహకరిస్తోందని, అందువల్ల రష్యాపై పరోక్ష ఒత్తిడి (సెకండరీ ప్రెజర్) తీసుకురావడానికి ఈ ఆంక్షలు విధించామని వివరించారు. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని, అందుకే ఈ చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. "ఈ యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. మీరు చూసినట్లుగా, భారత్‌పై ఆంక్షలు మరియు ఇతర చర్యలను కూడా ఆయన తీసుకున్నారు. ఈ యుద్ధం ముగియాలని ఆయన స్పష్టం చేశారు" అని లీవిట్ అన్నారు.

భారత్ కంటే చైనా రష్యా నుంచి ఎక్కువగా చమురు నిల్వలు దిగుమతి చేసుకుంటుంది. కానీ చైనా కంటే భారత్ రష్యాకు క్లోస్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్‌ను వాడుకొని ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేయాలని ట్రంప్ ఆలోచించాడు. దీంతో రష్యా కాళ్లు బేరానికి వచ్చేలా భారత్‌పై ఎగుమతి సుంకాలు పెంచాడు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్లి ట్రంప్‌తో భేటీ అయ్యాడు. అప్పుడు రహస్యంగా ట్రంప్ తన డిమాండ్స్ రష్యా ముందు పెట్టాడు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యాడు.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సమావేశంలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్రైపాక్షిక సమావేశానికి సుముఖత వ్యక్తం చేశారు. శాంతి చర్చలను వేగవంతం చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారని లీవిట్ నొక్కి చెప్పారు. "అధ్యక్షుడు ముందుకు సాగాలని, ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని కోరుకుంటున్నారు" అని ఆమె అన్నారు.

Advertisment
తాజా కథనాలు